డయల్ 100పై అవగాహన
ABN , First Publish Date - 2020-03-13T12:45:22+05:30 IST
భైంసా పట్టణంలోని శిశుమందిర్‌లోని విద్యా ర్థులకు సీఐ వేణుగోపాల్ డయల్ 100పై అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా సీఐ

భైంసాక్రైం, మార్చి12: భైంసా పట్టణంలోని శిశుమందిర్‌లోని విద్యా ర్థులకు సీఐ వేణుగోపాల్ డయల్ 100పై అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులందరికీ 100 నెంబర్‌పై అవగాహన ఉండాలన్నారు. ర్యాగింగ్, టీసింగ్ అని ఎవరైనా వేధిస్తే సమాచారం అందిం చాలన్నారు. బాలికలందరూ ఆత్మస్థైర్యంతో ఉండాలని, తల్లిదండ్రులు కూడా బాలికలను బాలురతో సమానంగా పెంచాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎస్సై విష్ణు ప్రకాష్, నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.