అయ్యప్ప భక్తుడిపై దాడి
ABN , First Publish Date - 2020-12-05T06:30:15+05:30 IST
ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ సమీపంలో కారు- ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

మస్కాపూర్ వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొన్న విషయంలో గొడవ
అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వామిని కొట్టటంతో ఆగ్రహించిన వైనం
నిరసన ర్యాలీతో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
రహదారి పైన రాస్తారోకో.. ఉద్రిక్తత..కేసు నమోదు
నిందితులపై చర్యలు తీసుకుంటామని నిర్మల్ డీఎస్పీ హామీతో సద్దుమణిగిన వివాదం
దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు
ఖానాపూర్/ఖానాపూర్ రూరల్ డిసెంబరు 4 : ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ సమీపంలో కారు- ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఖానాపూర్ నుండి మస్కాపూర్‌కు వెళుతున్న కారు, మెట్పల్లి వైపు నుండి ఖానాపూర్‌కు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే మోటార్‌సైకిల్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు అజీమ్, రఫీక్‌లు తన తండ్రికి ఫోన్ చేసి ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేసారు. దీంతో తండ్రి యూసూఫ్ సంఘటన స్థలానికి చేరుకొని కారు నడిపిన వ్యక్తి అయ్యప్పదీక్ష తీసుకున్న సాయినాథ్‌ను యూసూఫ్ చితక బాదాడు. ఈ సంఘటన చూస్తున్న చుట్టుప్రక్కల వారు అక్కడి చేరుకొని సముదాయించారు. అక్కడ మాటమాట ముదరటంతో గొడవకు దారితీసింది. అనవసరంగా సాయినాథ్‌ను కొట్టారని స్థానికులు ఆందోళన చేసారు. అక్కడే రహదారి పైన భైఠాయిం చారు. అయ్యప్ప భక్తులను కొట్టిన వారిపైన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేసారు. ఖానాపూర్ ఎస్ఐ భవానిసేన్ ఆందో ళన చేస్తున్న వారిని సముదాయించారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో క్షమాపణ చెప్పిం చారు. ఈ సందర్బంగా డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, అజీమ్, రఫీక్, యూసూప్లపైన కేపు నమోదు చేశామన్నారు, యూసూప్ అనే వ్యక్తి వేమనపెల్లిలో ఎలక్ట్రిసిటీలో జూనియర్ లైన్మెన్గా పని చేస్తున్నాడని తెలిపారు. కాగా వీరిది స్వగ్రామం జన్నారం మండలంలోని కలమడుగు అని తెలిపారు. కాగా అయ్యప్ప సేవా సమితి సభ్యులు రాజూర సత్యం, బీజేపీ నాయ కులు రాజశేఖర్, హిందూఉత్సవ సమితి నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.