ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-11-28T03:58:48+05:30 IST

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం టీఆర్‌ఎస్‌కెవి యూనియన్‌ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో నీరజకు వినతి పత్రం అందజేశారు.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
డిఎంహెచ్‌ఓ నీరజకు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఆశావర్కర్లు

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 27: ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం టీఆర్‌ఎస్‌కెవి యూనియన్‌ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో నీరజకు వినతి పత్రం అందజేశారు.  సంఘం జిల్లా అధ్యక్షురాలు కె విజయ మాట్లాడుతూ పారితోషికం విధానాన్ని రద్దు చేయాలని, నిర్ధిష్ట వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గౌరవ వేతనంగా నెలకు పదివేలు ఇవ్వాలన్నారు. గ్రామ సర్వే, ఆన్‌లైన్‌ లో నమోదు చేయడం తదితర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నా ప్రభుత్వ గుర్తింపు లభించడం లేదన్నారు. సర్వేకు సంబంధించిన రికార్డులు, యూనిఫాంలు, నెలనెలా వేతనం లేకుండా పనిచేయడం కష్టమవుతోందని,  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం  ఉధృతం చేస్తామన్నారు.  వాణి, శ్రీదేవి, గౌరవాధ్యక్షడు సురేందర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-28T03:58:48+05:30 IST