న్యూపిప్రిలో భూవివాదం
ABN , First Publish Date - 2020-11-26T05:42:41+05:30 IST
మండలంలోని న్యూపిప్రి గ్రామస్థులకు, లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామస్తులకు మధ్య బుధవారం ఇంటిస్థలాల విషయంపై ఇరు గ్రామస్థులకు వాగ్వాదం జరిగింది.

ఇరు గ్రామస్తుల మధ్య వాగ్వాదం
ముథోల్, నవంబరు 25 : మండలంలోని న్యూపిప్రి గ్రామస్థులకు, లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామస్తులకు మధ్య బుధవారం ఇంటిస్థలాల విషయంపై ఇరు గ్రామస్థులకు వాగ్వాదం జరిగింది. సంబందిత రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించి రెండు రోజులల్లో సమస్యలను పరి ష్కరిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమనిగింది, వివరాలల్లోకి వెళ్తే లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామం ఎస్ఆర్ఎస్పీలో ముంపునకు గురైంది, దీంతో వారికి ముథోల్ మండలంలోని చించాల గ్రామ సమీపంలోని భూమిని పిప్రి గ్రామానికి గతంలో ఇంటిస్థలాలను కేటాయిస్తూ ఎస్ఆర్ఎస్పీ అధికారులు పట్టాలను అంద జేశారు. ఐతే కొందరు న్యూపిప్రి గ్రామానికి వచ్చి స్థిరపడగా మరికొందరూ లోకే శ్వరం మండలంలో స్థిరపడ్డారు. వారికి కేటాహించిన స్థలాలు కబ్జాకు గురి కావడంతో తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు విన్నవించిన సమస్యపరిష్కారం కాలేదు, దీంతో బాదితులు ఇటీవల కలెక్టర్‌కు తమ సమస్య ను విన్నవించారు. దీంతో బుధవారం లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామ స్తులు ముథోల్ మండలంలోని పిప్రి గ్రామానికి వచ్చారు. ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు సంబంధిత అధికారులు సర్వేచేసి ఇంటిస్థలాలు గుర్తించే క్రమంలో ఇరు గ్రామస్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భైంసా ఆర్డీవో రాజు, ముథోల్ సీఐ అజయ్‌బాబు, తహసీల్దార్ లోకేశ్వర్రావులు అక్కడికి చేరుకుని ఇరువురు గ్రామస్తులకు నచ్చచెప్పారు. రెండు రోజులల్లో హద్దులను గుర్తించి సర్వే చేస్తామన్నారు.