మంచిర్యాల సిమెంటు కంపెనీని పరిరక్షించాలి

ABN , First Publish Date - 2020-12-31T04:31:13+05:30 IST

మంచిర్యాల సిమెంట్‌ కంపెనీ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌గౌడ్‌, నడిపెల్లి ట్రస్టు చైర్మన్‌ విజిత్‌కుమార్‌ బుధవారం వినతి పత్రం అందజేశారు.

మంచిర్యాల సిమెంటు కంపెనీని పరిరక్షించాలి
ఎంపీకి వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

- పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకు నాయకుల వినతి

మంచిర్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల సిమెంట్‌ కంపెనీ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌గౌడ్‌, నడిపెల్లి ట్రస్టు చైర్మన్‌ విజిత్‌కుమార్‌ బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆస్తులు అమ్ముకోవాలనే ఉద్దేశ్యంతో కంపెనీ యాజమాన్యం మూసివేతకు పాల్ప డుతోందని అన్నారు. యాజమాన్యం కార్మిక చట్ట వ్యతిరేకతకు పాల్పడు తోందన్నారు. కనీసం కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించడం లేదని చెప్పారు. కరోనా విపత్తులో అక్రమంగా 20 మంది కార్మికులను తొలగించారని అన్నారు. యాజమాన్యం వైఖరి కారణంగా కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు.  ఈ విషయమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో చర్చించాలని ఎంపీని కోరారు. వారి వెంట పలువురు ఎంసీసీ కార్మికులు ఉన్నారు.  

Updated Date - 2020-12-31T04:31:13+05:30 IST