రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-28T03:28:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
నెన్నెలలో రైతు పోరుయాత్రలో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు

నెన్నెల, డిసెంబరు 27: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా చేప డుతున్న పోరుయాత్ర ఆదివారం నెన్నెల మండలం లో కొనసాగింది. నాయకులు చాంద్‌పాష, డివిజన్‌ కార్యదర్శి టి.శ్రీనివాస్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షు డు రత్నం తిరుపతి మాట్లాడారు. మూడు బిల్లులు వ్యవసాయానికి మరణశాసనం లాంటివన్నారు. ఈ చట్టాల ద్వారా ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లు కను మరుగవుతాయన్నారు. పంటల ధరలపై కార్పొరేట్ల ఆధిపత్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈనెల 30న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. వి.మల్లన్న, ఎం.జ్యోతి, డి.రాజన్న, ఆర్‌.చరణ్‌, జె. శ్రీకాంత్‌  పాల్గొన్నారు.  

బెల్లంపల్లి: రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా రైతులు చేస్తున్న పోరా టాలకు మద్దతుగా సీపీ ఐ ఎంఎల్‌ రెడ్‌స్టార్‌ పార్టీ అనుబంధ అఖిల భారత విప్లవ రైతు సం ఘం ఆధ్వర్యంలో సం ఘం రాష్ట్ర కన్వీనర్‌ గోగర్ల శంకర్‌ ఆధ్వర్యం లో నెంబర్‌ 2 ఇం క్లైన్‌ బస్తీలో ర్యాలీ నిర్వహిం చారు. మోదీ ప్రభుత్వం    రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి రైతులను ఇబ్బందు లకు గురిచేస్తున్నారన్నారు. రైతులతో చర్చలు జరపాలని, రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్‌దుర్గయ్య, లింగంపెల్లి రాములు, ఆర్‌ మల్లయ్య, లక్ష్మి, రాజేష్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2020-12-28T03:28:30+05:30 IST