జిల్లాలో మరో మూడు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-14T11:24:05+05:30 IST

జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

జిల్లాలో మరో మూడు పాజిటివ్‌

నిర్మల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సోమవారం 16 రక్త నమూనాలు సేకరించారు. పాజిటివ్‌ కేసులలో భాగంగా ఒకరు నిర్మల్‌ పట్టణం పింజేరిగుట్టకు చెందిన వారు కాగా, ఇద్దరు వెంకటాపూర్‌ వాసులు. అయితే, ఇప్పటివరకు జిల్లాలో మొత్తం వెయ్యి మంది వద్ద నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా.. 61 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. 21 యాక్టివ్‌ కేసులున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు 60 మంది, అంతర్‌ జిల్లా వాసులు 299 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

Updated Date - 2020-07-14T11:24:05+05:30 IST