నిర్మల్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు

ABN , First Publish Date - 2020-04-24T10:07:59+05:30 IST

నిర్మల్‌ జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు బయట పడింది. స్థానిక బాగులవాడ మోతినగర్‌కు చెందిన యువకుడు ఢిల్లీలోని

నిర్మల్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు

మొదటి సారి నెగెటివ్‌.. 14 రోజుల క్వారంటైన్‌ తరువాత పాజిటివ్‌ 

ప్రైమరీ కాంటాక్ట్‌ల కోసం అధికారుల ఆరా 


నిర్మల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు బయట పడింది. స్థానిక బాగులవాడ మోతినగర్‌కు చెందిన యువకుడు ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చాడు. ఆయనకు మొదట కరోనా నెగెటివ్‌ రిపోర్టు రావడంతో 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉం చారు. క్వారంటైన్‌ గడువు తీరిపోవడంతో రెండు రోజుల క్రితం ఆ యువకుడిని ఇంటికి పంపారు. ఇంటికి పంపే సమయంలో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది రక్తం శాంపిళ్లను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపారు. ఇందులో నుంచి ఆ యువకుడికి గురువారం పాజిటివ్‌ రిపోర్టు రావడంతో అధికారులంతా ఆందోళనకు గురవుతున్నారు.


మొదట నెగెటివ్‌ రిపోర్టు రా గా 14 రోజుల తరువాత ఆయనకే పాజిటివ్‌ రావడంపై భయాందోళనలు నెలకొంటున్నాయి. సదరు యువకుడు మూడు, నాలుగు రోజుల క్రితమే 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి కావడంతో హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అ ధికారులు ఆయనను కోరారు. అతను హోం క్వారంటైన్‌లో ఉన్నాడో లేదో లే క బయట ఎంతమందిని కాంటాక్ట్‌ అయ్యాడో అనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం యువకుడు ఎవరెవరిని కాంటాక్ట్‌ అయ్యాడో అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 20 పాజిటివ్‌ యాక్టివ్‌ కేసులు కాగా ముగ్గురు మరణించారు. ఈ వ్యవహారంతో జిల్లా కేంద్రంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. 

Updated Date - 2020-04-24T10:07:59+05:30 IST