వైభవంగా భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-06-16T10:50:41+05:30 IST

దేవులవాడలో సోమవారం భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది.

వైభవంగా భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

కోటపల్లి, జూన్‌ 15: దేవులవాడలో  సోమవారం భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. మూడు రోజులుగా వేద పండితుల మంత్రోచ్ఛా రణల మధ్యన పూజలు కొనసాగగా చివరి రోజు హోమం, విగ్రహ ప్రతిష్టాపన కన్నులపండువగా సాగింది. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. వాలా శ్రీదేవి, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ సాంబా గౌడ్‌, జడ్పీటీసీలు మోతె తిరుపతి, వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-16T10:50:41+05:30 IST