మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-12-29T04:25:06+05:30 IST

రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మూడు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని సోమవారం ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

- ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఎదుట ఆందోళన

ఆసిఫాబాద్‌, డిసెంబరు 28: రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మూడు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని సోమవారం ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి చిరంజీవి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో యువత ఉన్నారని చెప్పారు. తెలంగాన ఏర్పడిన అనంతరం ప్రభుత్వం యువత ఆశలను వమ్ము చేస్తోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువత ఆత్మబలిదానాలు చేసుకుని సాధించుకున్నారన్నారు. వారి త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్‌ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో సురేష్‌కు అందజేశారు.  కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయుకలు మహేష్‌, గణేష్‌, రాకేష్‌, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T04:25:06+05:30 IST