అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2020-12-07T04:21:24+05:30 IST

ప్రతి ఒక్కరు అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు.

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి
అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు

-అదనపు కలెక్టర్‌ రాంబాబు 

రెబ్బెన, డిసెంబరు 6: ప్రతి ఒక్కరు అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. రెబ్బెన మండలం నక్కగలూగడ ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్‌ వర్ధంతి ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌  మాట్లాడుతూ  అంబేద్కర్‌ దేశంలో సమానత్వం కోసం ఎనలేని కృషి చేసినట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ రియాజ్‌, ఎంపీపీ సౌందర్య, ప్రధానోపాధ్యాయుడు కల్వల శంకర్‌, సర్పంచి దుర్గం రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ హరిత, గంగాపూర్‌ ఎంపీటీసీ సభ్యురాలు హరిత, శ్యాంరావు, పీఆర్టీయూ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌, భీంరావు, పిట్టల రవీందర్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు. 

Read more