డా.బీఆర్‌ అంబేద్కర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-07T06:21:41+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత, డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 64వ వర్ధంతిని పురస్కరించుకొని షెడ్యుల్‌ కులాల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయ ఆవరణలో ఆదివారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

డా.బీఆర్‌ అంబేద్కర్‌కు ఘన నివాళి
జిల్లాకేంద్రంలోని శాఖ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, అధికారులు

జిల్లావ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్‌ 64వ వర్ధంతి

పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత, డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 64వ వర్ధంతిని పురస్కరించుకొని షెడ్యుల్‌ కులాల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయ ఆవరణలో ఆదివారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు జగ్జీవన్‌రామ్‌, పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటు అంబేద్కర్‌ చౌక్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎంపీ సోయంబాపురావు, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లె నాందెవ్‌, అదనపు ఎస్పీ శ్రీనివా్‌సరావులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు, కలెక్టర్‌ మా ట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త, మహోన్నత వ్యక్తి డా.బాబాసాహెబ్‌ అం బేద్కర్‌ అని అన్నారు. దేశంలోని అట్టడుగు, పేద వర్గాల ప్రజల కోసం ఆయ న ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ప్రవీన్‌,ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, తదితరులున్నారు. 

పార్టీలకతీతంగా అంబేడ్కర్‌కు నివాళి

అంబేద్కర్‌ 64వ వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు గండ్రత్‌ సుజాత, బీసీ సంఘం నాయకులు ప్రమోద్‌ కుమార్‌ ఖత్రి, పార్థీసారథి, ఎమ్మార్పీఎస్‌, ఎంఎ్‌సఎఫ్‌, మాల సంక్షేమ సంఘం నాయకులతో పాటు అంబేద్కర్‌ వాదులు, భారతీయ బౌద్ధ మహాసభ సభ్యులు రత్నజాడే ప్రజ్ఞకుమార్‌లు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబా సాహెబ్‌ దేశానికి ఎంతో సేవ చేశారని వారు పేర్కొన్నారు. అటు ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్తర్‌, ఆర్‌ఎంఎ, ఆర్టీసీ డీవీఎం, ఉద్యోగులు, కార్మికుల తో కలిసి అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. 

ఆదిలాబాద్‌ రూరల్‌: అంబేద్కర్‌ 64వ వర్ధంతిని పురస్కరించుకొని తుడుందెబ్బ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. ఇందులో తుడుందెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్‌, ఎంపీటీసీ మర్సకోల లీలాబాయి, లోహార సర్పంచ్‌ ఆత్రం అనుసూయ, ఆదివాసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సలాంజంగుపటేల్‌, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్కశేషరావు, తుడందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు సర్పంచ్‌ చించుఘాట్‌ కుంరశ్యామ్‌రావు, తుడందెబ్బ జిల్లా కార్యదర్శి వెట్టి మనోజ్‌, తుడందెబ్బ యువజన జిల్లా అధ్యక్షుడు ఆత్రం వెంకటేశ్‌, అంబేద్కర్‌ ముమేంట్‌ కార్యకర్త తరోటే గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్‌, సర్పంచ్‌ జాదవ్‌ సునిత, లింగాపూర్‌ జాడి సుభాష్‌, ఉప సర్పంచ్‌ గజానంద్‌, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జైనథ్‌: మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రమైన జైనథ్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 64వ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో సర్పంచ్‌ దూమల దేవన్న, మాల సంక్షేమ సంఘం జైనథ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు దుబ్బాక భూమన్న, ఎ్‌స.ఉదయ్‌భాస్కర్‌, సోసైటీ డైరెక్టర్‌ కొప్పుల అడెల్లు, నాయకులు పాల్గొన్నారు. అలాగే, గిమ్మా గ్రామంలో ఆదివారం దళిత శక్తి ప్రోగ్రామ్‌ ఆధ్వర్యంలో భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఎంపీటీసీ కోల భోజన్న, దళిత శక్తి ప్రోగ్రామ్‌ ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌ గణే్‌షమహారాజ్‌ పాల్గొన్నారు.

తాంసి: అంబేడ్కర్‌ అందరివాడని పలువురు వక్తలు అన్నారు. తాంసి మండల కేంద్రంలో అంబేద్కర్‌ వర్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎంపీడీవో భూమయ్య, జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, అంబేద్కర్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌, ఆయా గ్రామాలకు చెందిన యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

సిరికొండ: మండలకేంద్రంలో అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో ఎంపీపీ పెందూర్‌ అమృత్‌రావ్‌, జడ్పీటీసీ చంద్రకళ, సర్పంచ్‌లు రఘురాం, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌:  మండల కేంద్రంతో పాటు, సోనాల, కౌఠ(బి), కన్గుట్ట, ధన్నూర్‌, పొచ్చెర గ్రామాలలో అంబేద్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళర్పించారు. కార్యక్రమంలో బోథ్‌ పట్టణ సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌, ఎంపీటీసీ కుర్మె మహేందర్‌, అంబేద్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు నల్ల చిన్నయ్య, వార్డు సభ్యులు నల్ల గంగయ్య, ఎ.రవి, వీడీసీ అధ్యక్షుడు గంగాధర్‌, గిరిధర్‌దేశ్‌పాండే, తదితరులు పాల్గొన్నారు. 

ఉట్నూర్‌: బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ 64వ వర్దంతిని ఏజెన్సీలోని ప్రజ లు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో ఉన్నవిగ్రహానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్థన్‌, ఉట్నూర్‌ ఇంచార్జీ ఆర్డీవో జాడి రాజేశ్వర్‌లు పూల మాలలు వేసి నివాళులు అర్పించా రు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు,  జీవ వైవిద్య మేనేజ్‌మెంట్‌ జిల్లా కమిటీ సభ్యులు మర్సుకోల తిరుపతి, బీంపూర్‌ తహసీల్దార్‌ ముంజం సోము, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.  

ఉట్నూర్‌ రూరల్‌: అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సోషల్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో అనాధలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గొడిపల్లి రాజ్‌కుమార్‌, యోగేశ్వర్‌, సూర్యవంశీ, పరమేశ్వర్‌, ప్రజ్ఞశీల్‌లున్నారు.

ఇంద్రవెల్లి: బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ వర్ధంతిని మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, స్వేరోస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో సర్పంచ్‌ కోరేంగ గాంధారి సుంకట్‌రావు, కోఆప్షన్‌ సభ్యులు మిర్జాజిలానీబేగ్‌, ఎండీ మసూద్‌, మోరే దిలీప్‌, మాస్కి రాజవర్ధన్‌, కాంబ్లే ఉత్తమ్‌, కాంబ్లే బద్దివాస్‌లున్నారు. 

ఇచ్చోడ: అంబేడ్కర్‌ వర్ధంతిని మండలకేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో దళిత సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ పాట్కురి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T06:21:41+05:30 IST