విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-30T05:25:46+05:30 IST

విద్యతోనే మనిషికి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని గిన్నెర, బిక్కు తండా, ముత్నూర్‌ గ్రామాల్లో పర్యటించారు.

విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఇంద్రవెల్లి, డిసెంబరు 29: విద్యతోనే మనిషికి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని గిన్నెర, బిక్కు తండా, ముత్నూర్‌ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. బిక్కుతండా గ్రామంలో పల్లెప్రగతి వనాన్ని ప్రారంభించారు. గిన్నెరలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ ఎన్ని సమస్యలు వచ్చినా చదువుకోసం అడుగు ముందుకు వేయాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ విధిగా మాస్క్‌లు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జడ్పీటీసీ అర్క పుష్పలత గ్రామ సమస్యలను విన్నవించగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కిషన్‌, డీఆర్డీడీవో రాథోడ్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, ఎంపీడీవో పుష్పలత, ఎంపీపీ శోభాబాయి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:25:46+05:30 IST