‘అందరూ సమాజ సేవలో ముందుండాలి’

ABN , First Publish Date - 2020-05-24T11:10:39+05:30 IST

అందరూ సమా జ సేవలు ముందుండాలని, మనిషి ఎంత ఎత్తుకెదిగిన దొరకనటువంటి సంతృప్తి స మాజ సేవలోనే ఉందని ఎమ్మెల్యే జోగురామ న్న

‘అందరూ సమాజ సేవలో ముందుండాలి’

ఆదిలాబాద్‌టౌన్‌, మే23: అందరూ సమా జ సేవలు ముందుండాలని, మనిషి ఎంత ఎత్తుకెదిగిన దొరకనటువంటి సంతృప్తి స మాజ సేవలోనే ఉందని ఎమ్మెల్యే జోగురామ న్న అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేం దర్‌ జన్మదినం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్మికులకు అన్నదా నం చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి వ్యక్తికి గౌరవం, గుర్తింపు రావాలంటే సామాజిక సేవతోనే వస్తుందన్నా రు. పట్టణంలోని శాంతినగర్‌లో సరుకులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని పాల్గొన్నారు. పట్టణం లోని సంజయ్‌ నగర్‌ కాలనీలో 173 మందికి పెట్రోల్‌ పంప్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ భోజన్న నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌రా వు, కృష్ణ, మౌనేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T11:10:39+05:30 IST