ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2020-03-24T12:44:10+05:30 IST

కరోనా (కోవిడ్‌ -19) వైరస్‌ సోకకుండా ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండి ముందుజాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌

ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి

జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన 

జిల్లా కేంద్రంలో ప్రజలకు స్వయంగా అవగాహన


ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి23: కరోనా (కోవిడ్‌ -19) వైరస్‌ సోకకుండా ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండి ముందుజాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ ఎ.శ్రీదేవసేన అన్నారు. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా, వారి నిత్యావసర స రుకులు కొనుగోళ్లు, ఇతర పనులకు ప్రతీ కు టుంబానికి ఒక్కరినే బయటికి వెళ్లేందుకు అ నుమతించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సోమవారం మధ్యాహ్నం కలె క్టర్‌ ఆదిలాబాద్‌ పట్టణంలోని కలెక్టర్‌చౌక్‌, రై తుబజార్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌, ఠాకూ ర్‌ హోటల్‌, పంజాబ్‌చౌక్‌ల గుండా ప్రయాణి ంచి పరిస్థితులను పరిశీలించారు.


రైతు బజా ర్‌లో వినియోగదారులకు అవగాహన కల్పిం చి సామాజిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని విస్త్రృతంగా మైక్‌ల ద్వారా ప్ర చారం చేయాలని రైతు బజార్‌ సూపర్‌వైజర్‌ లను ఆదేశించారు. గాంధీచౌక్‌లోని మందుల దుకాణంలో మందుల కొనుగోళ్లకు వచ్చే వినియోగదారులను వైరస్‌ నివారణపై అవ గాహన కల్పించాలని వినియోగదారులను దూరం దూరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని యజమానిని ఆదేశించారు. పట్టణ ంలో ద్విచక్రవాహనాలపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మనిషికి మనిషికి మధ్య కనీస దూరం పాటి ంచాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్ర జలు బయటకు వెళ్లకూడదన్నారు. 

Read more