ముగిసిన అఖండ హరినామ సప్తాహం
ABN , First Publish Date - 2020-12-15T06:19:40+05:30 IST
చుచుంద్ గ్రామ సిద్ధేశ్వర ఆలయంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం సోమవారం ముగి సింది.
భైంసారూరల్, డిసెంబరు 14 : మండలంలోని చుచుంద్ గ్రామ సిద్ధేశ్వర ఆలయంలో వారం రోజుల నుంచి కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం సోమవారం ముగి సింది. యోగేష్ మహరాజ్ ఆధ్వర్యంలో భజన, సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భం గా ఆలయ కమిటీ చైర్మన్ పి.రామన్న మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గ్రామకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.