ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
ABN , First Publish Date - 2020-12-02T04:02:24+05:30 IST
ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నీరజ పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 1 : ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నీరజ పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఐబీ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి యుండాలని, వ్యాధిగ్రస్తులు ఐసీటీసీ కేంద్రాలను వినియోగించుకోవాలని, జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాల ద్వారా మందులు పొందవచ్చని పేర్కొన్నా రు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి సుబ్బారాయుడు, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, ప్రోగ్రాం పర్యవేక్షకుడు అనిల్‌కుమార్, సబ్ యూని ట్ అధికారి నాందేవ్, కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, నర్మద, నరేందర్, రాజేందర్, స్నేహ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు : ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైద్యుడు సత్యనారాయణ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఎయిడ్స్ సోకిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ ఉచి త మందులు అందిస్తూ నివారణకు కృషి చేస్తున్నా మన్నారు.
2006లో ఆసుపత్రిలో ఐసీటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 2006 నుంచి ఇప్పటి వరకు ఏఆర్‌డీ ద్వారా 317 మందికి వ్యాధి సోకినట్లు గుర్తించామన్నారు. వారిలో 67 మంది చనిపోగా 250 మందికి మందులు ఇస్తున్నామన్నారు. వైద్యు లు రవికుమార్, రాజన్న, సతీష్, మహేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.