ఎయిడ్స్‌ నివారణపై విస్తృత ప్రచారం కల్పించాలి

ABN , First Publish Date - 2020-12-02T05:07:19+05:30 IST

ఎయిడ్స్‌ వ్యాధి నివారణపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదే శించారు.

ఎయిడ్స్‌ నివారణపై విస్తృత ప్రచారం కల్పించాలి
నిర్మల్‌లో గోడ ప్రతులను విడుదల చేస్తున్న కలెక్టర్‌

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 1: ఎయిడ్స్‌ వ్యాధి నివారణపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వైద్యశాఖ అధికారులను ఆదే శించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌కు సంబంధించిన గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి నివారణ చర్యలు చేపట్టాలన్నా రు. ఎయిడ్స్‌తో బాధపడే వారికి మందుల కంటే తోటివారి ఆదరణ, ఆప్యాయతలు, సమాజ తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ఎయిడ్స్‌ ర హిత నిర్మల్‌ జిల్లా స్థాపన కు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ధన్‌రాజ్‌, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ కార్తీక్‌, అధికారులు పాల్గొన్నారు.

‘ఎయిడ్స్‌  మహమ్మారిని పారద్రోలుదాం’

భైంసా: ప్రాణాంతకమైన ఎయిడ్స్‌ మహమ్మారిని పారద్రోలుదామని భైంసా ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి డా.అనిల్‌ కుమార్‌ జాదవ్‌  పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని  పురస్కరించుకొని ఐసీటీసీ ఆధ్వర్యంలో  స్థానిక ఏరియా ఆసుపత్రి అవరణలో నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంత వాసులకు ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహ న కల్పించి చైతన్యపరచేందుకు యువత, విద్యావంతులు చర్యలు చేపట్టాలని సూ చించారు. ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనయే లక్ష్యంగా పెట్టుకొవాలని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా ఫ్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించి పోస్టర్లను విడుదల చేశా రు. ఇందులో  ఐసీటీసీ కౌన్సిలర్లు సి.విలాస్‌, మహిపాల్‌ రెడ్డి, సతీష్‌ ల్యాబ్‌ టెక్నిషియన్లు తోఫిక్‌, సుధాకర్‌, ఎస్‌టీఎల్‌ఎస్‌ భరత్‌, శేషు, టీబీహెచ్‌వీ  కిషన్‌, ఎల్‌టీ వకులతో ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సోన్‌: ఎయిడ్స్‌ వ్యాధి నివారణపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని డాక్టర్‌ రమ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొట్టడానికి చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ నరేందర్‌, స్టాప్‌ నర్సు మంజుల, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:07:19+05:30 IST