ఎయిడ్స్ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి
ABN , First Publish Date - 2020-12-02T04:33:08+05:30 IST
ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.
-కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, డిసెంబరు1: ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్, డీఎంహెచ్‌వోలు ‘భాగస్వామ్యంతో బాధ్యత నిర్వహిద్దాం.. హెచ్‌ఐవీ సోకిన వారి పట్ల సంఘీభావంతో మెలుగుదాం’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దక్షణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 55 శాతం ఎయిడ్స్ బాధితులు ఉన్నారన్నారు. తెలంగాణలోని సూర్యాపేట 2.85 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా జయశంకర్ భూపాలపల్లి 0.01 శాతంతో చివరి స్థానంలో ఉందని, అలాగే కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా 0.02 శాతంతో 30వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 2008 నుంచి 2020 అక్టోబరు వరకు 1,54,094 మందికి స్వచ్ఛందంగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోగా 678 మందికి సోకినట్లు నిర్ధారించామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ కుమరంబాలు, డిప్యూటీ డీఎం హెచ్‌ఓ సుధాకర్‌నాయక్, టిసాక్స్ యూత్ కో ఆర్డినే టర్ రమేష్, కౌన్సిలర్ సతీష్, ల్యాబ్ టెక్నిషియన్ రఫీ పాల్గొన్నారు.