హార్వెస్టర్‌కు తగిలి వ్యవసాయ కూలీ మృతి

ABN , First Publish Date - 2020-12-05T06:45:55+05:30 IST

ఖానాపూర్‌ మండలంలోని బాధనకుర్తి గ్రామపంచాయతి పరిదిలో గల చింతల్‌పేట కు చెందిన కొండ రాజన్న (65) వ్యవసాయ కూలి హర్వెస్టర్‌కు తగిలి గాయాల పాలై మృతి చెందాడు.

హార్వెస్టర్‌కు తగిలి వ్యవసాయ కూలీ మృతి

ఖానాపూర్‌ రూరల్‌, డిసెంబర్‌ 4 ; ఖానాపూర్‌ మండలంలోని బాధనకుర్తి గ్రామపంచాయతి పరిదిలో గల చింతల్‌పేట కు చెందిన కొండ రాజన్న (65) వ్యవసాయ కూలి హర్వెస్టర్‌కు తగిలి గాయాల పాలై మృతి చెందాడు. గత 30 తారీకున గ్రామ సమీపంలో గల పొలంలో వరి కోతయంత్రంతో  పనులు చేస్తుండగా, కూలీ పనికి వెళ్ళిన రాజన్న హర్వేస్టర్‌ పక్కనే పనిచేస్తుండగా దోతి ప్రమాదశాత్తు మిషన్‌లో చిక్కుకుంది, దీంతో కాలు అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఖానాపూర్‌ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేసి నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య రాజవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భవానిసేన్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:45:55+05:30 IST