ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-11T04:29:23+05:30 IST
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు డీఈవో రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ అధ్యాయన కేంద్రాల్లో దూర విధానంలో 2020-21 సంవత్సరానికి గాను 10, ఇంటర్మీడియట్ కోర్సులలో అడ్మిషన్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.

ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 10: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు డీఈవో రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ అధ్యాయన కేంద్రాల్లో దూర విధానంలో 2020-21 సంవత్సరానికి గాను 10, ఇంటర్మీడియట్ కోర్సులలో అడ్మిషన్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఇందులో 14 ఏళ్లు నిండిన బడిమానేసిన బాల బాలికలు, వివిధ కారణాలతో పాఠశాల విద్యకు దూరమైన వారందరిని 10వ తరగతిలో, 15 ఏళ్లు నిండి పదవ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి ఇంటర్ దూర విధానంలో అడ్మిషన్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. అపరాద రుసుం లేకుండా వచ్చే నెల 1వ తేదీ వరకు, అపరాధ రు సుంతో 6 నుంచి 15వరకు ఉందని పేర్కొన్నారు.
ఫీజు వివరాలు...
పదవ తరగతి వారిలో ఓసీ పురుషులకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులకు అశక్తత, మాజీ సైనికొద్యుల పిల్లలు, మహిళలకు రూ.600, రిజిస్ర్టేషన్ ఫీజు రూ.100 అందరికి ఆన్ లైన్ చార్జీలు అదనంగా ఉంటాయన్నారు. ఇంటర్‌కు సంబంధించి ఓసీ పురుషులకు రూ1100, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పురుషులకు, అశక్తత, మాజీ సైనికో ద్యోగుల పిల్లలు, మహిళలందరికి రూ.800, చెల్లించాలని, రిజిస్ర్టేషన్ పీజు రూ.200 అందరికీ ఉంటుందని తెలిపారు.