భగీరథ అందుతుందా?

ABN , First Publish Date - 2020-03-12T09:14:17+05:30 IST

ప్రతీ ఇంటికి నల్లా ద్వా రా నీరందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భ గీరథ కార్యక్రమం జిల్లాలో

భగీరథ అందుతుందా?

ఉట్నూర్‌, మార్చి11: ప్రతీ ఇంటికి నల్లా ద్వా రా నీరందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భ గీరథ కార్యక్రమం జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చడానికి కుమరం భీం ప్రాజెక్టు నుంచి కొన్నేళ్లుగా చేపడుతున్న మి షన్‌ భగీరథ పనులు నేటికీ పూర్తయ్యింది లేదు.. ప్రజలకు నల్లా ద్వారా నీరు అందించిందీ లేదని ప్రజలు చెప్తున్నారు. అయితే అధికారులు మా త్రం వంద గ్రామాలకు భగీరథ నీరు అందిస్తున్నామని చెపుతున్నా సగం గ్రామాలకు కూడా నీరు అందింది లేదు.


ప్రభుత్వం గడువు విధించ డం, పనులు పూర్తి కాలేదని సమయం పెంచా లని కంపెనీ అధికారులు ప్రభుత్వం వద్దకెళ్లి గ డువు పొడగించుకోవడం పరిపాటిగా మారింది. పనులు ముందుకు సాగడం లేదని, సకాలంలో పూర్తిచేసి ప్రజలకు నీటి కష్టాలు రాకముందే నీరు అందించాలంటూ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జ నార్దన్‌తో పాటు ఎమ్మెల్యే అభిప్రాయ పడుతున్నారు. ఈయేడాది కూడా జిల్లాలోని గిరిజనుల కు మంచినీటి ఎద్దడి తప్పేలా లేదు.

ఏళ్లు గడుస్తున్నా..

జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని భా వించిన ప్రభుత్వం గిరిజనులకు శుద్ధజనం అం దించడానికి రూ.78కోట్లతోతో 2009లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ప నులు ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), నార్నూర్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లోని 228 గిరిజన గ్రామాలకు తాగునీరు అందించాలని భావించారు. గిరిజన గ్రామాలలోని ప్రతీ కుటుంబానికి రోజుకు 100లీటర్ల ర క్షిత నీటిని అందించాలని భావించారు.


ఇప్పటివ రకు 85శాతం నిధులు ఖర్చు అయినట్లు తెలు స్తున్నా కంపెనీ సిబ్బంది గిరిజన గ్రామాలకు కా వాల్సిన మంచినీరు అందించలేకపోయారు. 50 గ్రామాలకు కూడా ఇంకా తాగునీరు అందలేదు. పనులు చేపట్టిన సంస్థ ద్వారా జరిగిన పనుల్లో నాసిరకం పనులు చోటుచేసుకోవడంతో పైపులైన్‌లలో లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా అక్కడక్క డపోతోంది. ఉట్నూర్‌ పట్టణంలోని కొమ్ముగూడ, తహసీల్దార్‌ కార్యాలయం, పోలీసు స్టేషన్‌ సమీపంలో తదితర ప్రాంతాలలో పైపులైన్‌ల లీకేజీ లు ఏర్పడ్డాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తున్నా తొలత వే గం చూపెట్టిని ఆ తర్వాత పనులను జాప్యంగా చేస్తూ వస్తోంది. కెరమెరి ఘాట్‌ ప్రాంతంలో సై తం లీకేజీలు ఏర్పడినట్లు తెలుసుకున్న అధికారులు వెంటవెంటనే మరమ్మతులు చేయించారు. నార్నూర్‌ మండలంలోని పూసిగూడ, మాన్కాపూ ర్‌ వద్ద పైపులైన్లకు లీకేజీలు ఏర్పడడంతో మా న్కాపూర్‌ వద్ద మరమ్మతులు వేగంగా చేశారు. నార్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌ వరకు వేసిన  పైపులైన్‌కు పరీక్షలు చేసినా గిరిజన గ్రా మాలకు ఇంకా నీరు అందడం లేదు.

నార్నూర్‌లో నీటి ఎద్దడి

నార్నూర్‌ మండలంలోని మాదాపూర్‌, గణేష్‌పూర్‌గోండుగూడ, నాగల్‌కోండ, ఇలియాస్‌నగర్‌, గోం డుగూడ, కొత్తపల్లి(జి) తండా, రూప్పాపూర్‌, కునికాసా, చిన్నకుండి, చోర్‌గాం, రోమన్‌కా సా, దేవాపటార్‌, సుంగాపూర్‌, మాదాపూర్‌లలో మంచినీటి ఎద్దడి తీవ్రమవుతోంది. అదేవిధంగా ఉట్నూర్‌ మండలంలోని ఎర్రచెల్క, బలాన్‌పూర్‌, శాంతాపూర్‌, దొంగచింత, కామాయిపేట్‌, అల్లి గూడ, వంకతుమ్మ, గంగాపూర్‌, ఎర్రగుట్ట, ఉమ్రి కొలాంగూడ గోట్టిపటార్‌, సోనాపూర్‌, మరపగూడ, ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ, గట్టేపల్లి, చిమన్‌గొంది, పాటగూడ, చితాగూడ, కొలాంగూడ, నిజాంగూడ, దుబ్బగూడ, వాల్‌గో ండా హీరాపూర్‌లలో నీటి ఎద్దడి ఉంటోంది. ఈ సంవత్సరం అయినా భగీరథ నీరు అందుబాటులోకి వస్తుందో రాదోనని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. 

అలంకార ప్రాయంగా ఓహెచ్‌బీఎస్‌ఆర్‌, 

కొత్త ట్యాంకుల నిర్మాణాలు 

ఓవర్‌ హెడ్‌ బ్యాలెన్సింగ్‌ సర్వీస్‌ రిజర్వాయర్‌ (ఓహెచ్‌బీఎస్‌ఆర్‌) పనులు నేటికీ పూర్తికావడం లేదు. మరోవైపు కొత్త ట్యాంకుల నిర్మాణాలు కొ నసాగుతూనే ఉన్నాయి. 300 కిలోమీటర్ల మేర పైపులైన్‌ల పనులు పూర్తి చేసిన్పటికీ నాసిరకం పనులతో సర్కారు ఆశయం నీరుగారిందని పరిశీలకులు అంటున్నారు. కెరమెరి దనోరా, హట్టి, కేస్లాగూడ, జైనూర్‌ మండలం రాశిమెట్టి, నా ర్నూర్‌ మండలంలోని తాడిహత్నూర్‌, ఉట్నూర్‌ మండలంలోని శంభుగూడ వద్ద ఓహెచ్‌బీఎస్‌ఆర్‌లు నిర్మించారు. వీటికి గేట్‌ వాల్వులు పని చే యడం లేదని తెలుస్తోంది. శంభుగూడ వద్ద ని ర్మించిన బ్రేకింగ్‌ఫ్రేజర్‌ట్యాంక్‌లో నీరు ఎక్కడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణం పూర్తి అ యిన అక్కడక్కడ భూమిపైనే పైపులైన్‌లు కనిపిస్తున్నాయి. పనులు చేపట్టిన కంపెనీ ఆధ్వర్యం లో ఇంకా ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో పైపులైన్‌ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పర్యటించిన  సీఎం వో కార్యదర్శి స్మితసబర్వాల్‌ అసంతృప్తికి గురయ్యారు. 


ప్రభుత్వానికి నివేదిక అందించడంతో ప్రభుత్వం ఉన్నత విచారణకు సైతం ఆదేశించిన ట్లు తెలుస్తోంది. ఉట్నూర్‌లోని ఆర్డీవో కార్యాల యం వద్ద లక్షలాది రూపాయలు వెచ్చించి  ని ర్మించిన ఓహెచ్‌బీఆర్‌ సక్రమంగా లేదని భావించిన అదికారులు ఉట్నూర్‌లో పట్టణంలోని ఎస్‌ బీఐ సమీపంలో, డీడీఎంహెచ్‌వో కార్యాలయం ఆవరణలో మరో కొత్త ఓహెచ్‌బీఆర్‌లు నిర్మాణం ప్రారంభించారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ డిప్యూటీ ఈఈ  వెంకటేశ్వర్‌రావు వివరణ కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. 

Updated Date - 2020-03-12T09:14:17+05:30 IST