అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-07-18T10:30:28+05:30 IST
గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తే సర్పంచులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భారతిహోళికేరి అన్నారు

నెన్నెల, జూలై 17: గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తే సర్పంచులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భారతిహోళికేరి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచులకు నోటీసులు జారీ చేశామన్నారు. పనితీరు లో మార్పు రాకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకునే సదావకాశాన్ని ప్రభుత్వం కల్పించి భారీగా నిధులు విడుదల చేస్తోంద న్నారు. డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను నె లాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రైతు వేదికలు, ప్రకృతి వనాల పనులు సత్వ రం ప్రారంభించాలన్నారు. సంయుక్త కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్‌డీఏ పీడీ శేషాద్రి, ఎంపీపీ రమాదేవి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.