విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-03-18T06:12:39+05:30 IST

రెండో విడత పల్లె ప్రగతి పనుల్లో, నర్సరీలో మొక్కల నిర్వహణ తీరుపై కలెక్టర్‌ భారతి హోళికేరి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

రోడ్డుపై చెత్తచెదారం వేస్తే జరిమానా 

పల్లె ప్రగతి, నర్సరీల అలసత్వంపై కలెక్టర్‌ ఆగ్రహం 

దండేపల్లి, హాజీపూర్‌ మండలాల్లో నర్సరీలను పరిశీలన


దండేపల్లి, మార్చి 17 : రెండో విడత పల్లె ప్రగతి పనుల్లో, నర్సరీలో మొక్కల నిర్వహణ తీరుపై కలెక్టర్‌ భారతి హోళికేరి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మండల కేంద్రంలో పర్యటించి పల్లె ప్రగతి పని తీరు, కర్ణపేట, దండేపల్లి నర్సరీ నిర్వహణ తీరును  పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉన్న దుకాణ సముదాయాల ముందు పేరుకపోయిన చెత్తను చూసి అధికారులపై మండిపడ్డారు. ఎవరి షాప్‌ ముందు చెత్తాచెదారం నిల్వ ఉంటుందో వారికి జరిమా నావిధించాలని, రెండు దుకాణాలకు జరిమానా వేశారు. దండేపల్లి నర్సరీలో చెత్తాచెదారం, కవర్లు పడి ఉండ డంపై ఇలాగేనా నిర్వహణ అంటూ అధికారులపై మం డిపడ్డారు.


కర్ణపేటలో నర్సరీలో నిర్వహణ బాగాలేదని, కవర్లు ఎందుకు పడేశారని ఎంపీడీవో శ్రీనివాస్‌, ఈజీఎస్‌ ఈసీ శ్రీనివాస్‌, గ్రామ ప్రత్యేక అఽధికారి వాణిలపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.  వాటిని అక్కడి నుంచి తీసివేసి కవర్స్‌ భద్రత పర్చాలని అధికారులకు ఆదేశించి, వాటిని తొలగించే వరకు అక్కడే ఉన్నారు. తప్పుడు నివేదికలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయినప్పుడే గ్రామాలు  అభివృద్ధి చెందుతాయన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ సంగర్స్‌ సంతోష్‌కుమార్‌, గ్రామ ప్రత్యేక అధికారులు భానుచందర్‌, వాణి, సర్పంచులు భూక్య చంద్రకళ, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్‌, ఉప సర్పంచు గోట్ల భూమన్న ఉన్నారు. 


అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్‌ 

హాజీపూర్‌ మండలంలోని దొనబండలో మంగళవారం కలెక్టర్‌ భారతి హొళికేరి అభివృద్ధి పను లను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ, కంపోజ్డ్‌ షెడ్‌ల నిర్మాణాన్ని పరిశీలించారు. దొనబండలో పెంచు తున్న నర్సరీని పరిశీలించిన అనంతరం ప్రాంగణంలో ఒక మొక్కను నాటి నీటిని పోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  దొనబండలో అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేశారని, అన్ని మండలాలతో పోలిస్తే హాజీ పూర్‌ మండలంలో నిర్ణయించిన సమయంలో అన్ని పను లను పూర్తి చేశారని అభినందించారు. ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు.


బాలురకు మధ్యాహ్న సమయం వరకు ఎలాంటి భోజనాన్ని అందించలేదని బాలురు పేర్కొనడంతో వార్డెన్‌, సిబ్బంది కూడా సమయ పాలన పాటించకపోవడంతో వారి పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్య తీసుకుంటా మన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్‌ స్వర్ణలత, వైస్‌ ఎంపీపీ బేతు రవి రమాదేవి, సర్పంచ్‌ జాడి సత్యం, జడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ నయీం పాషా, ఎంపీడీఓ అహ్మద్‌ హై తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-18T06:12:39+05:30 IST