ప్లాస్టిక్‌ రహిత సమాజానికి చర్యలు

ABN , First Publish Date - 2020-12-31T04:32:23+05:30 IST

ప్లాస్టిక్‌ రహిత సమాజానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత సమాజానికి చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

-కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ 

లింగాపూర్‌, డిసెంబరు30: ప్లాస్టిక్‌ రహిత సమాజానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులకు, ఉపాధి హామి, ఐకేపీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలో మరుగుదొడ్లను పూర్తిగా నిర్మించి ఓడీఎఫ్‌గా ప్రకటించాలన్నారు. వాటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో చెత్త, ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుదామన్నారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలను నిర్మించు కోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్‌రావు, జడ్పీటీసీ రక్కాబాయి, ఎంపీపీ సవిత, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:32:23+05:30 IST