రైతులకు సహకార తిప్పలు

ABN , First Publish Date - 2020-02-05T21:10:37+05:30 IST

కొత్తగా ఏర్పడిన సిరికొం డ మండల రైతులకు సహకార ఎన్నికల్లోనూ తిప్పలు తప్పేలా లేవు. ఈ సారి కూడా సహకార ఎన్నికల్లో...

రైతులకు సహకార తిప్పలు

  • సహకార సంఘ పదవులు అందనంత దూరం
  • మళ్లీ ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల వారికే మద్దతు
  • సిరికొండ రైతులకు దురదృష్టంగా మారిన పదవులు
సిరికొండ, ఫిబ్రవరి 4 : కొత్తగా ఏర్పడిన సిరికొం డ మండల రైతులకు సహకార ఎన్నికల్లోనూ తిప్పలు తప్పేలా లేవు. ఈ సారి కూడా సహకార ఎన్నికల్లో మండలేతరులకే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు వ చ్చాయి. కొత్తగా మండలం ఏర్పడడంతో కష్టాలు దూ రమైనట్లేనని భావిస్తున్న తరుణంలో మండలవా సు లకు తిప్పలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అ సెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొ న్న ప్రస్తుతం కూడా తిప్పలు పడనున్నారు.
 
అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోకి..
సిరికొండ మండలం రెండు అసెంబ్లీ నియోజక వ ర్గ పరిధిలోకి రావడంతో ఎన్నికల సమయంలో మండ లవాసులు విడిపోవలసి వస్తుంది. బోథ్‌ అసెంబ్లీ ని యోజకవర్గం పరిధిలో పొన్న, సోన్‌పెల్లి, రాయిగూడ, సుంకిడి, సిరికొండ, నేరడిగొండ (జి), నారాయణపూ ర్‌, జెండగూడ, కుంటగూడ పంచాయతీలు ఉండగా, ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాం పూర్‌(బి), కొండాపూర్‌, పోచంపెల్లి, ఖన్నాపూర్‌, ధర్మ సాగర్‌, మల్లాపూర్‌, వాయిపేట, ఫకీర్‌నాయక్‌తండా, లచ్చింపూర్‌(బి), రిమ్మ పంచాయతీలున్నాయి.
 
ప్రతీ ఎన్నికల్లో పంచాయతీల ఓటర్లు విడిగా ఓట్లు వేస్తు న్నారు. కనీసం సహకార ఎన్నికల్లోనైనా ఒక మండ లంలో ఓట్లు వేయగలమని ఆశలు కన్నారు. కానీ, ప్రభుత్వం ఆ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం కూడా విడివిడిగానే ఓట్లు వేయాల్సి వచ్చింది. కొత్తగా మం డలం ఏర్పడడంతో సహకార ఎన్నికల్లో ఒకచోట ఓట్లు వేసే అవకాశం కల్పిస్తారని, మరొక్క రైతు ప్రతినిధి వచ్చేస్తారని భావించారు. సిరికొండ మండలంలో రెం డు సహకార సంఘాలు ఏర్పాటు చేసే సాంకేతాలు గతంలో ప్రభుత్వం నుంచి రావడంతో మండల వాసు ల్లో ఆశలు రేకెత్తాయి. కానీ, ఆ ఆశలు ఎంతకాలం ని లువలేక పోయాయి. ఒక్క ప్రాథమిక వ్యవసాయ స హకార సంఘం ఏర్పాటుకు కూడా అవకాశం ఇవ్వలే క పోయింది. సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రభు త్వం విడుదల చేయడం, కొత్త సంఘాల ఏర్పాటుకు బ్రేక్‌ వేయడంతో మండల వాసులు ఒక్కసారిగా ఖం గుతిన్నారు. మళ్లీ పాత సంఘాల వారీగానే ఓట్లు వే యాలనే ఉత్తర్వులు వెలువడడంతో తిప్పలు పడనున్నారు.
 
మండలంలో సహకార ఎన్నికలలో ఓటు హ క్కు కలిగిన రైతులు రెండు మండలాలకు వెళ్లి ఓటు వేయాల్సి వచ్చింది. ఇంద్రవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలకు మండలంలోని అనేక మంది రైతులు ఇంద్రవెల్లి మండల వాసులను, ఇచ్చో డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్ని కలకు ఇచ్చోడ మండల వాసులకు ఓటు వేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎన్నికల్లో మండలానికి చెంది న రైతు నాయకులు తలపడడానికి అవకాశం కోల్పో వలసి వచ్చింది. మండలంలో ప్రత్యేక సహకార సం ఘం ఏర్పాటు చేస్తే మండల వాసులకు ఓటు వేసి, మండల వాసినే చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశాన్ని కో ల్పోయారు. మండల నాయకులకు చెర్మన్‌ పదవి ద క్కే అవకాశాలు సైతం కోల్పోయారు.
 
4,528 మంది రైతులు
మండలంలో 4,528 మంది రైతులు ఉన్నారు. కొత్త గా ఇచ్చిన పొరంపోకు భూములకు, అటవీ హక్కు ప త్రాలు పొందిన రైతులను కూడా పరిగణలోకి తీసుకుంటే రైతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉం టుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా ప్రత్యేకం గా ఒక మండల అధ్యక్షుడు, ఒక జడ్పీటీసీగా ఎన్నిక య్యే అవకాశం మండల వాసులకు దక్కింది. మండ ల ఓటర్లు తమకు అనుకూలమైన వ్యక్తిని ప్రజాప్రతి నిధిగా ఎన్నుకున్నారు. కానీ, సహకార ఎన్నికల్లో త మకు అనుకూలమైన ప్రత్యేక రైతు నాయకున్ని, రైతు ప్రతినిధిని ఎన్నుకునే అవకాశంను కోల్పోయారు.

Updated Date - 2020-02-05T21:10:37+05:30 IST