బాలుడిని ఢీకొట్టిన లారీ

ABN , First Publish Date - 2020-02-05T20:33:53+05:30 IST

ఆదిలా బాద్‌ జిల్లా జైనథ్‌ మండలం లోని పిప్పర్‌వాడ 44వ జాతీ య రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న బాలు డిని లారీ ఢీకొట్టింది. స్థానికు లు

బాలుడిని ఢీకొట్టిన లారీ

జైనథ్‌, ఫిబ్రవరి4: ఆదిలా బాద్‌ జిల్లా జైనథ్‌ మండలం లోని పిప్పర్‌వాడ 44వ జాతీ య రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న బాలు డిని లారీ ఢీకొట్టింది. స్థానికు లు నిమ్స్‌కు తరలించగా వై ద్యుల సూచన మేరకు బాలుడి ని హైదరాబాద్‌కు తరలిస్తుండ గా మార్గంమధ్యలో మృతిచెందాడు. గ్రామస్థులు, జైనథ్‌ మండల పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. పిప్పర్‌వాడ గ్రామానికి చెందిన టాఫ్రె కార్తీక్‌ (7) సోమవారం రాత్రి హనుమాన్‌ ఆలయం ఫంక్షన్‌ హా ల్‌లో భోజనం నిమిత్తం బాలుడు పిప్పర్‌వాడ 44వ జాతీయ రహదారి దాటుతున్నాడు.
 
ఈక్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి ఆదిలా బాద్‌ వైపు వెళ్తున్న లారీ బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తిక్‌ రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. చికిత్స నిమిత్తం గ్రామస్థులు ప్రైవేట్‌ ఆటోలో జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలి స్తుండగా మార్గంమధ్యలో కామారెడ్డి వద్ద రాత్రి 12గంటలకు మృతిచెం దాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సాయిరెడ్డి వెంకన్న కేసు దర్యాప్తు చేస్తున్నాడు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Updated Date - 2020-02-05T20:33:53+05:30 IST