జాబ్‌మేళాకు విశేష స్పందన

ABN , First Publish Date - 2020-03-08T12:18:16+05:30 IST

పట్టణంలోని ఏఎం ఫంక్షన్‌హాల్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన వచ్చింది.

జాబ్‌మేళాకు విశేష స్పందన

ఖానాపూర్‌, మార్చి 7 : పట్టణంలోని ఏఎం ఫంక్షన్‌హాల్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన వచ్చింది. జిల్లా నలు మూలల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బెంగుళూరుకు చెందిన జీఎంఆర్‌ గ్రూప్స్‌ రక్షా అకాడమి సె క్యూరిటీ సన్వీసెస్‌ సంస్థ ద్వారా 350 మంది యువకులను ఆయా విభాగాల్లో సెక్యూరిటీ గార్డులుగా పని చే సేందుకు ఆ కంపెనీ ఎంపిక చేసింది.


జాబ్‌మేళాను జి ల్లా ఎస్పీ శశిధర్‌రాజ్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకుని అనుకుని నిరాశ చెందే బదులు తమకున్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఆయా రంగాల్లో ప్రా వీణ్యం సాదించాలన్నారు. ఉద్యోగం, ప్రభుత్వమా, ప్రైవేటా అని కాకుండా యువత స మయాన్ని వృథా చేయకుండా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలువాలన్నారు. జాబ్‌మేళాకు అనుకున్న స్థాయికన్నా ఎ క్కువ మంది నిరుద్యోగులు రావడం, అందు లో మహిళా అభ్యర్థులు కూడా రావడంతో మరోసారి జాబ్‌మేళా నిర్వహిస్తామని అ న్నారు. ఎంపికకాని అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. యువత పనిలో నిమగ్నం అయితే పెడతోవ పట్టదన్నారు. అనంతరం రక్షా అకాడమికి చెందిన సుదాం ఆధ్వర్యంలో యువత కు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2020-03-08T12:18:16+05:30 IST