అంబేద్కర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-04-15T05:30:00+05:30 IST

అంబేద్కర్‌ జయంతిని ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో, గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

అంబేద్కర్‌కు ఘన నివాళి

ఆంధ్రజ్యోతి, నిర్మల్‌ నెట్‌వర్క్‌ : అంబేద్కర్‌ జయంతిని ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో, గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు చౌరస్తాల వద్ద అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. మరికొందరు తమ తమ ఇంట్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.


ఈ జయంతి సందర్భంగా పలు సంఘాల ఆధ్వర్యంలో నాయకులు పేదల కు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2020-04-15T05:30:00+05:30 IST