తెలంగాణలో యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ

ABN , First Publish Date - 2020-04-01T18:17:26+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తొలిసారిగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. కల్వకుర్తి పట్టణానికి చెందిన...

తెలంగాణలో యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ

నాగర్‌కర్నూల్‌లో తొలి పాజిటివ్‌ కేసు

కల్వకుర్తి యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ

15 మంది కుటుంబ సభ్యులకు సెల్ఫ్‌ క్వారంటైన్‌


నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తొలిసారిగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ నుంచి నలుగురు, కల్వకుర్తి నుంచి నలుగురు, అచ్చంపేట నుంచి మరో ముగ్గురు ఈ నెల 14న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి తబలీక్‌ జమాత్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ 11 మందిని సోమవారం జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వారి శాంపిల్స్‌ను గాంధీ ఆస్పత్రికి పంపించారు.


వారిలో కల్వకుర్తికి చెందిన 34 ఏళ్ల యువకుడికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 18న కల్వకుర్తికి వచ్చిన ఆ యువకుడు వచ్చాక ఎవరెవరిని కలిశాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని 15 మంది కుటుంబ సభ్యులను సెల్ప్‌ క్వారంటైన్‌లో ఉంచారు.

Updated Date - 2020-04-01T18:17:26+05:30 IST