అంతర్మథనం

ABN , First Publish Date - 2020-12-07T05:59:34+05:30 IST

ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా భవిష్యత్‌పై ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్మఽథనం మొదలైంది.

అంతర్మథనం

దిద్దుబాటు దిశగా టీఆర్‌ఎస్‌ 

దుబ్బాక, గ్రేటర్‌ ఫలితాలతో కారులో కదలిక 

తెరపైకి ఇంటలిజెన్స్‌ నివేదికల విశ్వసనీయత

నేతలపై ఆరోపణలు, పథకాల ప్రభావంపై నజర్‌ 

నియోజకవర్గస్థాయిలో పార్టీ పరిస్థితిపై అంతర్గత సమావేశాలు 

ఆదేశాలు వెలువరించిన అధిష్ఠానం

ఇక కార్యాచరణకు రంగం సిద్ధం

నిర్మల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా భవిష్యత్‌పై ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్మఽథనం మొదలైంది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల కారణంగా ఆ పార్టీ సెల్ప్‌ రివ్యూకు సిద్ధమవుతోంది. ఈ రెండు ఎ న్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్‌లో ఉండవచ్చన్న సంకేతాల నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైనట్లు పలువురు చెబుతున్నా రు. ఇందులో భాగంగానే నియోజకవర్గస్థాయిలో సమీక్ష సమావేశాలు చేసి విధానపరమైన లోపాలతో పాటు నేతల మధ్య సయోధ్య, ప్రత్య ర్థి పార్టీల కార్యాచరణ వంటి అంశాలపై చర్చించుకోవాలంటూ అధిష్ఠా నం ఆదేశించినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వె లువడిన రోజే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిద్దుబాటు చ ర్యల దిశగా దృష్టి కేంద్రీకరించి కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. అదే రోజు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరంగా అంతర్గత సమావేశా లు నిర్వహించాలంటూ సూచించినట్లు సమాచారం. కేసీఆర్‌ పరోక్ష హెచ్చరికల రూపంలో ఉన్న ఈ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకటి, రెండు రోజుల్లోనే సమావేశాల ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ సమావేశా లు ఎమ్మెల్యేల నేతృత్వంలో చేపడుతున్నప్పటికీ రాష్ట్రస్థాయి నేతలను సైతం పరిశీలకులుగా పంపేందుకు అధిష్ఠానం యోచిస్తోంది. 

ఇంటలిజెన్స్‌ సమాచారంపై ఆరా

ప్రతిరోజూ స్థానికంగా అధికార పార్టీ చేపడుతున్న కార్యకలాపాలు, ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు సంబంధించిన అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను నివేదికల రూపంలో అందిస్తున్న ఇంటలిజెన్స్‌ సమాచారంపై అధిష్ఠానం సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొద్దిరోజు ల నుంచి జిల్లాలోని ఇంటలిజెన్స్‌ వర్గాలు రూపొందిస్తున్న నివేదికల విశ్వనీయతపై నా యకులే సందేహాలను వ్యక్తం చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ అంతర్గత సమావేశా ల్లో దీనిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ప్రజల మనోభావాలను వాస్తవరూపంలో తెలుసుకోకుండా అధినేతలను సంతృప్తి పరిచేలా ఇం టలిజెన్స్‌ వర్గాలు నివేదికలు రూపొందిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ఇంటలిజెన్స్‌ నివేదికలనే నమ్ముకొని అందుకు అనుగుణంగా కార్యాచరణను అమలు చే స్తున్న అధికార పార్టీ ఇక నుంచి ఆ వైఖరికి భిన్నంగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, కొంతమంది నాయకుల అవినీతి కార్యకలాపాలపై విస్తరిస్తున్న విమర్శలకు సంబంధించిన వాస్తవ సమాచారా న్ని ఇంటలిజెన్స్‌ వర్గాలు దాస్తున్నట్లు అధిష్ఠానం భావిస్తోంది. పార్టీపరంగా ప్రత్యర్థలను ఎలా ఎదుర్కొవాలనే అంశంతో పాటు క్షేత్రస్థాయిలో పథకాలు అమలయ్యేలా చూడడం కేడర్‌పై వస్తున్న ఆరోపణలను సైతం పరిగణలోకి తీసుకుంటూ చర్యలు చేపట్టాలని అ ధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు దిద్దుబాటు చర్యలను చే పట్టి ప్రత్యర్థులకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు చెబుతున్నారు.

నిర్మల్‌ సెగ్మెంట్‌లో..

రాజకీయ కేంద్రంగా పిలుచుకునే నిర్మల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీఆ ర్‌ఎస్‌ మరింత అప్రమత్తమవుతోంది. ఈ నియోజకవర్గానికి నేతృత్వం వహించే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఇక తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం పార్టీపై పడకుండా చేయడమే మంత్రి లక్ష్యంగా ప లువురు చెబుతున్నారు. నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలపడుతుండడం, ఆ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అప్పాల గణేష్‌లు చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మంత్రి దృష్టి పెట్టారు. మహేశ్వర్‌ రెడ్డి కదలికలను గమనిస్తూ అందుకు కార్యాచరణ చేపట్టేందుకు ఇప్పటికే తన అనుచరులతో మం తనాలు చేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో మహేశ్వర్‌ రెడ్డితో పా టు కొంతమంది టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తి నాయకులు సైతం బీజేపీ వైపు చూస్తున్నారన్న సమాచారంతో మంత్రి వేగంగా పావులు కదిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో నె లకొన్న పరిస్థితులపై తప్పుడు సమాచారం అందు తోందని, ఇంటలిజెన్స్‌ వర్గాలు సైతం వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా నివేదికలు ఇస్తున్న అంశాన్ని మంత్రి పరిగణలోకి తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను ఓ వైపు క్రీయాశీలకం చేస్తూనే తాను స్వీయ పర్యవేక్షణ చే పట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పథకాలపై కూడా స్వయంగా గ్రామస్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నట్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నే తలపై వస్తున్న ఆరోపణల విషయంలో ఇక నుంచి సీరియస్‌గా వ్యవహరించాలని భావిస్తున్నట్లు ఆ యన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌, బీ జేపీలకు అవకాశం ఇవ్వకుండా పార్టీ పరంగా ఆధిపత్యం కొనసాగే అంశానికి కూడా ఆయన ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలుస్తోంది. 

ముథోల్‌, ఖానాపూర్‌పై సమీక్షలు.. 

ఖానాపూర్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎ స్‌ అంతర్మధనం జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితా ల ప్రభావంతో ఈ సెగ్మెంట్‌లలో బీజేపీ మరింత బలపడే అవకాశాలున్నాయి. ఖానాపూర్‌ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కొంతకాలం నుంచి అంతర్గత విభేధాలను ఎదుర్కొంటోందన్నది బహిరంగ రహస్యమే. స్థానిక ఎమ్మెల్యే వైఖరి కారణంగా చాలా మంది సీనియర్‌ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది నాయకులపై వస్తున్న ఆరోపణలు భవిష్యత్‌లో పార్టీపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌ వైఖరిపై ఇప్పటికే పలువురు సీనియర్‌ నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదు లు చేశారు. దీనిపై అధిష్ఠానం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసు కొని కారణంగా సీనియర్‌లంతా అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న కథనా లు కూడా నియోజకవర్గంలో చర్చకు తావిస్తున్నాయి. నియోజకవర్గం లో రమేష్‌ రాథోడ్‌కు బలమైన అనుచరగణం ఉండడమే  కాకుండా, సానుభూతిపరులు ఆయనకు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. బీజేపీ సై తం పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ రమేష్‌ రాథోడ్‌ బీజేపీలో చేరితే టీఆర్‌ఎస్‌ గట్టి కౌంటర్‌ ఏర్ప డుతుందన్న అభిప్రాయాలున్నాయి. అసంతృప్తితో ఉన్న కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ప్రతికూలత మొదలయ్యే అవకాశాలున్నాయి. కొద్దిరోజుల్లో ఇక్కడ కూడా ని యోజకవర్గస్థాయి అంతర్గత సమావేశం జరిపి లోటుపాట్లపై సమీక్షించుకోనున్నారు. 

ముథోల్‌ సెగ్మెంట్‌లో కూడా ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డిపైనా పలువురు సీనియర్‌ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నా రు. ఎమ్మెల్యే వ్యవహార శైలి కూడా ముందులా గా కాకుండా విరుద్ధంగా మారిందన్న ఆరోపణలున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీలో అ సంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బీజేపీ టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదుగుతోంది. మొ న్నటి వరకు అర్బన్‌కే పరిమితమైన ఆ పార్టీ ప్రస్తు తం ప్రతి గ్రామంలో కేడర్‌ను పెంచుకొని బలపడుతోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఇ క్కడి ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపడమే కాకుం డా కీలక సమీకరణలకు ఆ స్కారమిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ పరిస్థితులపై  నిర్వహించే అంతర్గత సమావేశం కొంతమేరకైనా దిద్దుబాటు చర్యలకు తో డ్పడాలని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

ఎప్పటికప్పుడు వాస్తవ నివేదికలు

వాస్తవాలకు అనుగుణంగా నివేదికలు అం దించాల్సిన ఇంటలిజెన్స్‌ వర్గాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఆ నివేదికల పై ఆధారపడకుండా సెల్ప్‌ ఇంట లిజెన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మే రకు ప్రైవే టు ఏజెన్సీలను రంగంలోకి దించాలని భావిస్తుంది. ప కడ్బందీ కార్యాచరణను అమ లు చేస్తూ ప్రత్యర్థి పార్టీలను కంగు తినిపించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది.

 

Updated Date - 2020-12-07T05:59:34+05:30 IST