నేనుంటే మీరు సేఫ్‌ అంటోంది!

ABN , First Publish Date - 2020-03-13T21:23:26+05:30 IST

సమాచార భద్రత కోసం వీపీఎన్‌ సర్వీసుల్ని ఆశ్రయిస్తారు జనం. కానీ ఆ వీపీఎన్‌ సర్వీసులే హ్యాకింగ్‌కి గురయితే? అది విశ్వసనీయతనే దెబ్బ తీస్తుంది.

నేనుంటే మీరు సేఫ్‌ అంటోంది!

సమాచార భద్రత కోసం వీపీఎన్‌ సర్వీసుల్ని ఆశ్రయిస్తారు జనం. కానీ ఆ వీపీఎన్‌ సర్వీసులే హ్యాకింగ్‌కి గురయితే? అది విశ్వసనీయతనే దెబ్బ తీస్తుంది. సంస్థ అయినా సాఫ్ట్‌ వేర్‌ అయినా అంతే! నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం కష్టం. అయితే నార్డ్‌ వీపీఎన్‌ ( Nord VPN ) అనే వీపీఎన్‌ సర్వీస్‌ - గతంలో తాను కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి చూరగొంటూ సంచలనం సృష్టిస్తోంది.


మొదటినుంచీ నార్డ్‌ వీపీఎన్‌ ఎంతో పాపులర్‌ సర్వీస్‌గా పేరుపొందింది. తక్కువ ఖర్చులో ఎక్కువ సెక్యూరిటీ ఇస్తుందనే నమ్మకం తెచ్చుకుంది. అయితే ఇటీవల హ్యాకింగ్‌ దాడికి గురి కావడం వల్ల నార్డ్‌ వీపీఎన్‌ పట్ల అభిమానులు నమ్మకం కోల్పోవడం జరిగింది. అయితే ఆ హ్యాకింగ్‌ని తట్టుకుని - నార్డ్‌ వీపీఎన్‌ తిరిగి తన యూజర్ల నమ్మకాన్ని చూరగొంటోంది. ఇప్పుడు కేవలం నెలకి మూడు డాలర్ల ఖర్చుతో సమాచార ప్రైవసీ అందిస్తోంది నార్డ్‌ వీపీఎన్‌.  నేనుంటే మీ సమాచారం సేఫ్‌! మీ వ్యక్తిగత భద్రతకి నేను హామీ - అంటోంది.


సమాచార ప్రైవసీ కోసం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్స్‌ మీద ఆధారపడడం ఇప్పుడు సాధారణమైపోయింది. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ని షార్ట్‌కట్లో వీపీఎన్‌ (VPN) అంటారు. నెట్లో మన చర్యల ద్వారా మన గురించి సమాచారం తెలుసుకోవడానికి వీలు లేకుండా - మన ఒరిజినల్ ఐపీ అడ్రస్ ని మాస్క్‌ చేసి, మరోచోట ఉన్నట్టుగా చూపిస్తుంది VPN. అందుకే ఈ మధ్యకాలంలో అందరికీ VPN ల పట్ల ఆసక్తి పెరిగింది. చాలామంది కేవలం పైరసీ చేయడానికే వీపీఎన్‌ సర్వీసుల్ని వాడుతున్నప్పటికీ నిజానికి భద్రత పరంగా VPN అనేది గొప్ప సర్వీస్‌. ఇంటర్నెట్ లో యూజర్‌ ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉండేందుకు, ఒక ఎనానిమస్‌ స్టేటస్ లో ఉండేందుకు VPN సాయపడుతుంది. అయితే ఈ వీపీఎన్‌లు పూర్తిగా భద్రంగా ఉన్నాయా అంటే లేదనే చెప్పాల్సిన పరిస్థితులూ ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో Nord VPN, Tor Guard VPN అనే రెండు VPN సర్వీసులూ హ్యాకింగ్‌ దాడికి గురయ్యాయి. అయితే ఇటీవల అవి మళ్లీ రేటింగ్‌ ని పుంజుకుని నిలదొక్కుకుంటున్నాయి.

Updated Date - 2020-03-13T21:23:26+05:30 IST