స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పండుగ చేసుకునే న్యూస్ చెప్పిన షియోమి
ABN , First Publish Date - 2020-10-19T21:42:35+05:30 IST
టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చైనా ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ కంపెనీ షియోమి...

4000 ఎంఏహెచ్ స్మార్ట్‌ఫోన్‌కు 20 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్
వైర్లెస్ చార్జర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు షియోమి ప్రకటన
టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చైనా ఎలక్ట్రానిక్, మొబైల్ ఫోన్ కంపెనీ షియోమి మరో సరికొత్త ఆవిష్కరణను తెరపైకి తెచ్చింది. త్వరలో 80 వాట్స్ సామర్థ్యం కలిగిన ఎంఐ వైర్లెస్ ఛార్జర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
గత సంవత్సరం ఇదే తరహాలో 30 వాట్స్ వైర్లెస్ ఛార్జర్‌ను తీసుకొచ్చిన షియోమి.. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల బ్యాటరీల సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో 80వాట్స్ వైర్లెస్ ఛార్జర్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎంఐ వైర్లెస్ ఛార్జర్‌తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 19 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని షియోమి తన బ్లాగ్‌లో తెలిపింది. ఒక్క నిమిషంలో 10 శాతం, 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చని వెల్లడించింది. 2021 నాటికి మార్కెట్లోకి ఈ వైర్లెస్ ఛార్జర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.