వైర్లెస్ రిపీటర్తో ఉపయోగం ఉంటుందా?
ABN , First Publish Date - 2020-07-11T06:32:36+05:30 IST
వైర్లెస్ రిపీటర్తో ఉపయోగం ఉంటుందా?
మా ఇంట్లో అన్ని ప్రదేశాలకూ వైర్లెస్ సిగ్నల్ సరిగా రావడం లేదు. వైర్లెస్ రిపీటర్ కొనడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? - రాజశేఖర్
వైర్లెస్ రూటర్ను ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి మార్చడానికి అవకాశం లేనప్పుడు, ఇంట్లో ఉన్న అన్ని ప్రదేశాలకూ మరింత మెరుగైన వైర్లెస్ సిగ్నల్ పొందడం కోసం వైర్లెస్ రిపీటర్ కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే మీ ఇంటి ఏరియా ఎక్కువగా ఉన్నప్పుడు, ఒకటి కంటే ఎక్కువ రిపీటర్లు వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దాని కంటే వైర్లెస్ రూటర్ అమర్చిన ప్రదేశం చుట్టు పక్కల అవాంతరాలు లేకుండా చూసుకుంటే సిగ్నల్ బాగుంటుంది.