వాట్సాప్‌ యూజర్లకు మరో గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2020-04-22T01:49:13+05:30 IST

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు

వాట్సాప్‌ యూజర్లకు మరో గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఒకేసారి నలుగురు వీడియో కాల్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు దీనిని 8 మందికి పెంచింది. అయితే, ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది. జూమ్, గూగుల్ డ్యుయో యాప్‌లు ఈ విషయంలో ముందుండడంతో ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ విషయమై దృష్టి సారించి వీడియో కాలింగ్ సామర్థ్యాన్ని 8 మందికి పెంచింది.


ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ వెర్షన్ 2.20.133 బీటా, ఐవోఎస్‌ 2.20.50.25 బీటా వెర్షన్ల ద్వారా అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లోనే మొత్తం వాట్సాప్ వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వినియోగదారుల వద్ద ప్రస్తుతం బీటా వెర్షన్ ఉన్నప్పటికీ, అవతలి వ్యక్తుల వద్ద కూడా అది అందుబాటులో ఉంటేనే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం సాధ్యం అవుతుంది. ఒకవేళ అప్‌డేట్ చేసినా 8 మందికి కాల్ కనెక్ట్ కాకుంటే చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకుని వాట్సాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

Updated Date - 2020-04-22T01:49:13+05:30 IST