మెయిల్స్‌ క్యూలో ఉంటే ఏమి చేయాలి?

ABN , First Publish Date - 2020-10-31T06:35:20+05:30 IST

కొన్నిసార్లు నా ఫోన్లో ఉండే జీమెయిల్‌ యాప్‌తో మెయిల్స్‌ పంపిస్తే చాలాసేపు క్యూలోనే

మెయిల్స్‌ క్యూలో ఉంటే ఏమి చేయాలి?

కొన్నిసార్లు నా ఫోన్లో ఉండే జీమెయిల్‌ యాప్‌తో మెయిల్స్‌ పంపిస్తే చాలాసేపు క్యూలోనే ఉండిపోతున్నాయి. దీనికి పరిష్కారం సూచించగలరు?

- పరమేష్‌, వరంగల్‌

నెట్‌వర్క్‌ సక్రమంగా ఉందో లేదో పరిశీలించండి. తాత్కాలికంగా వైఫై ఆఫ్‌ చేసి, మీ మొబైల్‌ డేటా ద్వారా ఆ మెయిల్స్‌ సెండ్‌ అవుతున్నాయో లేదో చూడండి. కొన్నిసార్లు అకౌంట్‌ సింక్రనైజేషన్‌ సెట్టింగులు కరప్ట్‌ అవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు మీ ఫోన్లో సెట్టింగ్స్‌, అకౌంట్స్‌ అనే విభాగంలోకి వెళ్లి జీమెయిల్‌ అకౌంట్‌ తొలగించి, తిరిగి మళ్లీ జతచేయండి. కచ్చితంగా సమస్య పరిష్కారమవుతుంది.

అలాగే కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు, పబ్లిక్‌ ప్రదేశాల్లో పబ్లిక్‌ వై-ఫై వాడేటప్పుడు అక్కడ కొన్ని ఔట్‌గోయింగ్‌ కనెక్షన్లు పోర్ట్‌ బ్లాకింగ్‌ ద్వారా బ్లాక్‌ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.


Read more