పీసీ నుంచి మొబైల్‌కి ఫ్రీగా కాల్ చేసేదెలా?
ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST
ఫ్రీగా కాల్ చేసేదెలా? పీసీ నుంచి మొబైల్‌కి కాల్ చేయడానికి అందుబాటులో ఉన్న ఫ్రీ యాప్స్ ఏంటి? వీడియో కాల్ ఎలా చేయాలి?
ఫ్రీగా కాల్ చేసేదెలా? పీసీ నుంచి మొబైల్‌కి కాల్ చేయడానికి అందుబాటులో ఉన్న ఫ్రీ యాప్స్ ఏంటి? వీడియో కాల్ ఎలా చేయాలి?
- జగన్
రెండు డివైజ్‌ల మధ్య సహజంగా జరిగే కాల్స్ రెండు రకాలుగా ఉంటాయి. మామూలు టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా రూట్ అయ్యే కాల్స్ ఒక తరహా అయితే, ఇంకోటి వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసుల ద్వారా నిర్వహించబడే కాల్స్. ఉదాహరణకు స్కైప్, వాట్సప్ వంటి అప్లికేషన్స్ ద్వారా మీరు చేసుకునే కాల్స్ అన్నీ వాయిస్ ఓవర్ ఐపీ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అవి మాత్రమే ఉచితంగా వస్తాయి. మామూలు ఫోన్ నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకోవాలంటే కొన్ని అప్లికేషన్స్ ఉచితంగా కనిపిస్తాయి గానీ అవి చాలా ప్రమాదకరం కూడా! కొన్ని యాప్స్ విషయంలో క్రెడిట్స్ కొనుగోలు చేస్తే మాత్రమే టెలికాం నెంబర్లకి కాల్స్ చేసుకోవడానికి వీలవుతుంది.
మీ టెక్ సందేహాలకు సమాధానాల కోసం navya@andhrajyothy.com