-
-
Home » Technology » Virus Is The Reason For Them To Get Demand
-
వైరస్ పుణ్యమా అని వాటి దశ తిరిగింది!
ABN , First Publish Date - 2020-03-14T02:45:26+05:30 IST
కరోనా వైరస్ కారణంగా కొన్ని కంపెనీల దశ తిరిగింది. అవి ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్‌కి డిమాండ్ పెరిగింది.

కరోనా వైరస్ కారణంగా కొన్ని కంపెనీల దశ తిరిగింది. అవి ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్‌కి డిమాండ్ పెరిగింది. 'వైరస్ కారణంగా డిమాండ్' - అంటే అవేవో మాస్క్‌లనుకునేరు! కాదు. సాఫ్ట్‌వేర్లు. రిమోట్ వర్కింగ్ టూల్స్, ఇంకా సిఆర్‌ఎమ్ ( కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ) టూల్స్ .
ఉదా.కి సిస్కో కంపెనీ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం తయారుచేసిన వెబెక్స్ (Webex) రిజిస్ట్రేషన్లు విపరీతంగా పెరిగాయట. అలాగే కస్టమర్ రిలేషన్‌షిప్ టూల్స్ విషయంలో జోహో సూట్‌కి ఎంతో డిమాండ్ పెరిగిందట. ఇప్పటికే ఆదరణ ఉన్న గూగుల్ జి-సూట్ లాంటివాటికీ మునుపటికంటే ఆదరణ పెరిగిందట.
ఇవి మాత్రమే కాదు, Nimble, HubSpot CRM, Salesforce, Oracle CRM On Demand, Pipedrive, Oracle CRM, Insightly, Freshsales, Microsoft Dynamics 365 - ఇలా ఎన్నెన్నో టూల్స్ కి ఇప్పుడు డిమాండ్ అమాంతంగా పెరిగింది. అవును మరి! బిజినెస్ ఆగకూడదు. ఆఫీసులో పనులు ఆగకూడదు. బయట చూస్తే కరోనా భయం! ఇంకేం చేయాలి? అందుకే అంతా వీటి మీద విపరీతంగా డిపెండ్ అవుతున్నారు.