ట్విట్టర్‌ ‘టాపిక్స్‌’

ABN , First Publish Date - 2020-10-31T06:31:09+05:30 IST

ట్విట్టర్‌ భారత వినియోగదారుల కోసం ప్రత్యేకించి ‘టాపిక్స్‌’ పేరిట

ట్విట్టర్‌ ‘టాపిక్స్‌’

ట్విట్టర్‌ భారత వినియోగదారుల కోసం ప్రత్యేకించి ‘టాపిక్స్‌’ పేరిట కొత్త ఫీచర్‌ను ఆరంభించింది. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. తమకు ఆసక్తి ఉన్న వాటిని మాత్రమే ఫాలో అయ్యే అవకాశం ఈ ఫీచర్‌తో లభిస్తుంది. సదరు సబ్జెక్టులో నిపుణులు సహా వివిధ మార్గాల్లో వచ్చే యావత్తు సమాచారాన్ని చూసుకోవచ్చు, సంభాషించుకోవచ్చు. వినియోగదారుడు ఇక్కడ చేయాల్సిందల్లా టాపిక్‌ను ఎంపిక చేసుకోవడమే. వెంటనే సంబంధిత టాపిక్‌పై ట్విట్టర్‌లో ఉన్న నిపుణులు, ఫ్యాన్స్‌, మాట్లాడాలని భావించే వారి అకౌంట్లన్నీ ప్రత్యక్షమవుతాయి. 


క్రీడల నుంచి తాము నివసిస్తున్న పట్టణం వరకు సబ్జెక్టు ఏదైనా కావచ్చు. అలాగే మరొక సబ్జెక్టులోకి వెళ్ళాలని అనుకున్నా అందులోకి మారిపోవచ్చు. హిందీలో ట్వీట్‌ దేవనాగరి లిపిలో, స్పీచ్‌ రోమన్‌ ఆల్ఫబెట్‌లో ఉంటాయి. ఇంగ్లీష్‌, జపనీస్‌, స్పానిష్‌, పోర్చుగీసు, అరబిక్‌ భాషల్లో కూడా టాపిక్స్‌ అందుబాటులో ఉంటాయి.


Read more