హ్యాక్ కాకుండా ఉండాలంటే..!
ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST
ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?...
ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- వరుణ్
ఒకప్పుడు మొబైల్ హ్యాక్ చేయాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్ కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అనేక రెడీమేడ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫోన్లని హ్యాక్ చేయడం చాలా సులభమైపోయింది. హ్యాకర్ల బారినపడకుండా ఉండాలంటే మొట్టమొదట అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన లింకులను క్లిక్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పలురకాల ఆఫర్ల పేరుతో వచ్చే లింకులకి దూరంగా ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తప్పించి ఇతర సైట్ల్ల నుంచి అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోకూడదు. కొంతమంది యాంటీవైరస్ ఉంటే సరిపోతుంది అని భావిస్తుంటారు. కానీ ఫోన్లో యాంటీ వైరస్ ఉన్నా కూడా హ్యాకింగ్ పేలోడ్లను గుర్తించలేదు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండటమే మంచిది.