గ్లోబల్ విలేజ్ వద్దురా బాబూ! లోకల్ విలేజే బెస్ట్!
ABN , First Publish Date - 2020-04-21T20:39:10+05:30 IST
టెక్నాలజీ వచ్చి అందరినీ కలిపేసింది. ప్రపంచం అంతా ఒక్కటే! అంటూ రాసుకుపూసుకు తిరగడం నిన్నటివరకే! కరోనా వచ్చి ఇప్పుడు సీన్ మొత్తం మార్చి పడేసింది.

టెక్నాలజీ వచ్చి అందరినీ కలిపేసింది. ప్రపంచం అంతా ఒక్కటే! అంటూ రాసుకుపూసుకు తిరగడం నిన్నటివరకే! కరోనా వచ్చి ఇప్పుడు సీన్ మొత్తం మార్చి పడేసింది. ఏళ్ల తరబడి డబ్బు వేటలో, ఉపాధి బాటలో టౌన్ పక్కకెళ్లిన మనుషులు ఇప్పుడు పల్లెటూరిని తలచుకుంటున్నారు. సిటీ హడావిడిలో కంగాళీ అయిపోయిన మనసులు ఇప్పుడు నేలమీదకి దిగి ఆలోచిస్తున్నాయి. మరి కరోనా తరవాత గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్‌కి దీటుగా బాబ్జీ చెబుతున్న కొత్త జీవితపు కాన్సెప్ట్ ఏంటో చూడండి మరి!
టెక్ టాక్ : బాబోయ్! గ్లోబల్ విలేజ్ వద్దురా బాబూ!
రాంజీ : ఏరా బాబ్జీ ఇది చూశావురా? ఈ కరోనావైరస్ వచ్చి ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో!
బాబ్జీ : ఏం గొప్పగా మార్చేసిందేంటి? ఎవడికి వాడు భయపడుతూ ఇంట్లో కూర్చోవడమేగా? ఇదా మార్పు?
రాంజీ : నేనడిగేది... ఈ సిట్యుయేషన్ వల్ల నీకు ప్రపంచం గురించి కొత్తగా ఏం అర్థమయిందని?
బాబ్జీ : అర్థం అవ్వడానికి ఏముందిరా? ఇంతకాలం మనుషులంతా చాలా డిఫరెంట్ అనుకునేవాణ్ణి. ఒక్కో దేశంలో మనుషులు ఒక్కోలా ఉంటారని అనుకునేవాణ్ణి. ఇప్పుడు మనుషులంతా ఒక్కటే అని తెలుసుకున్నా.
రాంజీ : అబ్బో.
బాబ్జీ : అవున్రా. అమెరికా వాడంటే టెక్నాలజీలో గొప్ప అనీ.. చైనావాడు ఫైటింగుల్లో గ్రేటనీ... ఫ్రెంచి వాడికి స్టయిల్ ఎక్కువనీ... బ్రిటిష్ వాడికి గర్వం ఎక్కువనీ... ఇలా రకరకాల అభిప్రాయాలుండేవి... కానీ ఒరే... అందరూ ఒకటేరా... చావు భయం లాంటిది వచ్చేసరికి.. ప్రతివాడూ … ముసుగెట్టి పడుకుంటాడు.
రాంజీ : ( ఎక్స్ప్రెషన్ )
బాబ్జీ : చూడు. ఇప్పుడు బ్రిటిష్ వాడయితే ఏంటి.. బొబ్బర్లంక వాడయితే ఏంటి... బిడాయించుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇంక తేడా ఏముంది? ఇంకా చెప్పాలంటే - ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే ఇండియా వాడే వీళ్లందరిలో బెటర్‌గా ధైర్యంగా ఉన్నాడు.
రాంజీ : ఒరే. ఇండియా అయితే ఏంటి? ఇంగ్లాండయితే ఏంటి? జర్మనీ అయితే ఏంటి?.. జమ్మలమడుగు అయితే ఏంటి... భయం అన్నది అందరికీ ఒకటే కదా? మనిషన్నాక - భయం, ఆకలి, కోరిక – ఈ మూడూ మారవ్. దేశాలు మారినా అక్కడ తేడాలుండవ్.
బాబ్జీ : టెక్నాలజీ చెప్పమంటే తత్వశాస్త్రం చెబుతున్నట్టున్నావ్?
రాంజీ : చెప్పేది పూర్తిగా వినరా. మామూలుగా చూస్తే ప్రపంచం మహా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అనేక రంగులు, దేశాలు, ప్రాంతాలు, కల్చర్లు, కులాలు, మతాలు... అబ్బో ఎంత వెరైటీ అనిపిస్తుంది. టెక్నాలజీ వచ్చి అందరినీ ఒకళ్లకొకళ్లకి పరిచయం చేసింది. ఇప్పుడు కరోనా వచ్చి అందరినీ మానసికంగా మరింత దగ్గర చేసింది.
బాబ్జీ : అబ్బో. గొప్ప పని చేసిందిలే!
రాంజీ : అలా తీసిపడేయకురా. మనుషులు చూడు.. మామూలప్పుడు కొట్టుకుంటారు. కానీ బయటినుంచి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం? అందరూ ఒక్కటైపోతారు.
బాబ్జీ : అవున్రా. హాలీవుడ్ సినిమాల్లో అంతే. వాళ్లలో వాళ్లు కొట్టుకు చస్తుంటారు. ఇంతలో గ్రహాంతరవాసులు ఫైటింగ్‌కి వస్తారు. అప్పుడు గతిలేక వీళ్లంతా ఏకమవుతారు. అదే కదా నువ్వు చెప్పేది?
రాంజీ : ( ఎక్స్ప్రెషన్ )
రాంజీ : అవున్రా. పూర్వం దేశ దేశాలన్నీ వేరు వేరు … చాలా చాలా దూరం అనుకునేవాళ్లం. కానీ టెక్నాలజీ వచ్చాక.. అందరూ దగ్గరైపోయాం కదా?. ఇప్పుడు వీడియో కాల్ చేసి ఎవ్వరితో అయినా మాట్లాడేయచ్చు. ఏ భాషయినా ట్రాన్స్‌లేట్ చేసుకుని చదివేయచ్చు. ఒక దగ్గరితనం వచ్చిందా లేదా?
బాబ్జీ : ( బ్లింక్ )
రాంజీ : అలాగే ఇప్పుడు కరోనాకి మందు కనిపెట్టడానికి దేశదేశాలూ ఎలా ట్రై చేస్తున్నాయో చూశావా? మనుషుల కోసం మనుషులు కష్టపడుతున్నారు. గ్లోబల్ విలేజ్ అంటే అదే మరి! ఐకమత్యంగా ఉండడం...
బాబ్జీ : ఏం ఐకమత్యంరా బాబూ... అసలు మనకి ఆ దిక్కుమాలిన గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ వద్దురా!
రాంజీ : అదేంట్రా అలా అంటావ్? ఇప్పుడేగా ప్రపంచం అంతా ఒక్కటే అన్నావ్? ఐకమత్యంగా ఉండద్దా?
బాబ్జీ : ఐకమత్యం? బావుంది. ఆ ఫ్రాన్సోళ్ల కోసం తెచ్చిన మాస్కులు యూఎస్ వాడు ఎక్కువ డబ్బులిచ్చి ఎగరేసుకుపోయాట్ట. అదేనా ఐకమత్యం? అయినా ఐకమత్యం అంటే... ఒకణ్ణొకడు రాసుకు పూసుకోమని కాదు. అసలు దేశాలన్నీ ఇంతగా లింక్ అయిపోవడం వల్ల కూడా ఎన్నో ప్రమాదాలొస్తున్నాయ్. ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ ఎన్ని దేశాల్ని ఇబ్బంది పెడుతోందో చూడు.
రాంజీ : నీ మాటా రైటేలే!
బాబ్జీ : అసలు ఈ గ్లోబల్ విలేజ్ అన్న కాన్సెప్ట్ కంటే బెటర్ అండ్ బెస్ట్ కాన్సెప్ట్ నా దగ్గరొకటుందిరా.
రాంజీ : ఏంట్రా ఆ కాన్సెప్టు?
బాబ్జీ : లోకల్ విలేజ్ కాన్సెప్ట్
రాంజీ : లోకల్ విలేజ్ కాన్సెప్టా? ఏంట్రా అదీ?
బాబ్జీ : ఏవుందిరా? ఈ సిటీనించి దూరంగా... మా విలేజ్‌కి పోయి... పొలం దున్నుకుని బతకడం... పెరట్లో కూరగాయలు పండించుకుని, ఉన్నదాంట్లోనే హాయిగా ఉండడం... అదీ నా బెస్ట్ కాన్సెప్ట్...
రాంజీ : అదేంట్రా? మరి మిగతా ప్రపంచంతో కనెక్షన్ అక్కర్లేదా?
బాబ్జీ : అక్కర్లేదురా బాబూ.
రాంజీ : అదేంట్రా? మరి పల్లెటూళ్లో ఆదాయం వస్తుందా? వచ్చింది సరిపోతుందా?
బాబ్జీ : ఒరే. ఆశ లేకుండా బతికితే అన్నీ సరిపోతాయ్. అసలు ఉన్న ఊళ్లో ఉండడం కంటే హ్యాపీ ఏం ఉందిరా? అయినా ఇంటర్నెట్ చచ్చిపోలేదుగా? అంతగా డబ్బులు సరిపోకపోతే ఏదో ఆన్లైన్ జాబ్ వెతుక్కుంటాం. తీరిగ్గా ఉన్నప్పుడు కంప్యూటర్‌లోంచి పనిచేసి నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించుకుంటాం. జీతం అకౌంట్లో పడుతుంది. ఉన్న ఊళ్లో సొంత ఇంట్లో ఉంటాం. ఈ ట్రాఫిక్ గోలలూ ఉండవు. పర్యావరణ కాలుష్యాలూ ఉండవు. మనకి హ్యాపీ. ప్రపంచానికి శాంతి. ఎలా ఉంది నా లోకల్ విలేజ్ కాన్సెప్టు?
రాంజీ : ( ఎక్స్ప్రెషన్ )
వీడియో ఇక్కడ చూడండి :