హవాయ్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌

ABN , First Publish Date - 2020-12-26T07:13:22+05:30 IST

హవాయ్‌ ఆండ్రాయిడ్‌కి పోటీగా కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వస్తోందని అంటున్నారు. దాని గురించి తెలుపగలరు...

హవాయ్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌

హవాయ్‌ ఆండ్రాయిడ్‌కి పోటీగా కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వస్తోందని అంటున్నారు. దాని గురించి తెలుపగలరు. 

- బాలాజీ, చిత్తూరు


హవాయ్‌ లాంటి కొన్ని నిర్దిష్టమైన చైనా కంపెనీలతో తమ సంస్థలు వ్యాపారం చేయకుండా అమెరికా ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం నిషేధం విధించింది. ఆ నేపథ్యంలో యూఎస్‌కి చెందిన గూగుల్‌ సంస్థ తాము తయారు చేసిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను హవాయ్‌ ఫోన్లకి సరఫరా చేయడం నిలిపివేసింది.  ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా హార్డ్‌వేర్‌ తయారీ రంగంలో ఉన్న హవాయ్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి ప్రత్యామ్నాయంగా ‘హార్మోనీ ఓయస్‌’ అనే ప్రత్యేకమైన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూపొందించుకుంది. వాస్తవానికి ఇప్పటివరకు మార్కెట్లో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తూ విడుదలైన హవాయ్‌  ఫోన్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కొత్తగా ఆ సంస్థ విడుదల చేసే ఫోన్స్‌లో మాత్రం హార్మోనీ ఓయస్‌  నిక్షిప్తమై ఉంటుంది. ఈ సంవత్సరం చివర్లో విడుదల య్యే అనేక హవాయ్‌  ఫోన్‌లలో ఇది లభించబోతోంది. 

Updated Date - 2020-12-26T07:13:22+05:30 IST