టిక్‌టాక్‌కు ఆల్టర్నేటివ్స్‌

ABN , First Publish Date - 2020-12-26T07:11:40+05:30 IST

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌లో రూపొందిన షార్ట్‌ వీడియో యాప్స్‌లో అయిదు బహుళ ప్రజాదరణ పొందుతున్నాయి. ‘జోష్‌’, ‘మైట్రాన్‌’, ‘మోజ్‌’, ‘ఎమ్‌ఎక్స్‌ టకాటక్‌’, ‘పబ్లిక్‌’ వంటివి ఉపయోగకరంగా ఉండటమే కాదు, ప్రాంతీయ భాషల్లో షార్ట్‌ వీడియోల తయారీకి వీలుగా ఉన్నాయి...

టిక్‌టాక్‌కు ఆల్టర్నేటివ్స్‌

  • ఈ ఐదు యాప్స్‌


టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌లో రూపొందిన షార్ట్‌ వీడియో యాప్స్‌లో అయిదు బహుళ ప్రజాదరణ పొందుతున్నాయి. ‘జోష్‌’, ‘మైట్రాన్‌’, ‘మోజ్‌’, ‘ఎమ్‌ఎక్స్‌ టకాటక్‌’, ‘పబ్లిక్‌’ వంటివి ఉపయోగకరంగా ఉండటమే కాదు, ప్రాంతీయ భాషల్లో షార్ట్‌ వీడియోల తయారీకి వీలుగా ఉన్నాయి. ఆరంభించిన రెండు నెలల్లోనే ‘మైట్రాన్‌’ ఒక కోటి డౌన్‌లోడ్స్‌ను రికార్డు చేసింది. ‘చింగారి’ పరిస్థితి కూడా ఇదే విధంగాఉంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సహా అతి పెద్ద సంస్థల నుంచి వంద మిలియన్‌ డాలర్ల మేర నిధులను రాబట్టగలిగింది. 


‘జోష్‌’ను బెంగళూరుకు చెందిన వీర్‌ సె ఇన్నోవేషన్‌  అభివృద్ధిపర్చింది. న్యూస్‌ కంటెంట్‌ అందించే డైలీహాంట్‌ దీని వెనుక ఉంది. అచ్చంగా టిక్‌టాక్‌ మాదిరిగానే ఇది పనిచేస్తుంది. ఫేవరేట్‌ ట్యూన్స్‌ మొదలుకుని ఫన్నీ వీడియోల వరకు దీంతో రూపొందించుకోవచ్చు. ఇంగ్లీష్‌కు తోడు తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్‌ను అందించవచ్చు. 


‘మోజ్‌’ను షేర్‌చాట్‌ డెవలప్‌ చేసింది. ఈ ఏడాది జూలైలో ఆరంభించిన రెండు రోజులకే యాభైవేల వరకు డౌన్‌లోడ్స్‌ను రికార్డ్‌ చేసింది. పదిహేను భాషల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ క్రీడల నుంచి ఆహార పదార్ధాల తయారీ వరకు వివిధ వీడియో రూపకల్పనలకు వీలు కల్పిస్తోంది. 


‘ఎంఎక్స్‌ టకాటక్‌’ అచ్చంగా టిక్‌టాక్‌ నుంచి ప్రేరణ పొందిన యాప్‌. ఎంఎక్స్‌ మీడియా దీన్ని రూపొందించింది. పూర్తి స్థాయి క్విక్‌ వీడియో ఎడిట్‌ టూల్స్‌, పెద్ద సంఖ్యలో స్టిక్కర్లు, ఫిల్టర్‌, క్విక్‌ షేర్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇప్పటి వరకు అయిదు కోట్ల మేర డౌన్‌లోడ్స్‌ దీనికి ఉన్నాయి. 


పబ్లిక్‌ లోకల్‌ న్యూస్‌ యాప్‌. జిపిఎస్‌ లొకేషన్‌ ఆధారంగా క్రీడల సంబంధ  మ్యాచ్‌లు, పవర్‌ కట్‌, స్థానికంగా వార్తలకు అర్హమయ్యే సంఘటనలను రూపొందించుకోవచ్చు. 


‘మెట్రాన్‌’ ఒకరకంగా టిక్‌టాక్‌ను నిషేధించగానే ఊపందుకున్న యాప్‌. పాకిస్థాన్‌కు చెందిన రీపాకేజ్డ్‌ యాప్‌గా భావించి డెవలపర్లు మొదట్లో దీన్ని తిరస్కరించారు. గూగుల్‌ ప్లే నుంచి కూడా తొలగించారు. తరవాతి రోజుల్లో మళ్ళీ గూగుల్‌ ప్లేలో స్థానం పొందడమే కాదు, స్వల్ప వ్యవధిలోనే ఒక కోటి మేరకు డౌన్‌లోడ్స్‌ను సాధించింది. క్రియేషన్‌కు అనుగుణంగా వివిధ ధ్వనులను ఇందులో కలుపుకోవచ్చు. సొంత ధ్వనిని కూడా తీసుకోవచ్చు.


Updated Date - 2020-12-26T07:11:40+05:30 IST