‘టెలిగ్రామ్’ కొత్త ఫీచర్లు
ABN , First Publish Date - 2020-10-03T05:32:53+05:30 IST
టెలిగ్రామ్ యాప్ పలు కొత్త ఫీచర్లను అభివృద్ధిపర్చింది. మెసేజ్‌లను వెదికిపట్టుకునేందుకు కొత్త సెర్చ్ ఫిల్టర్‌ను మెరుగుపర్చింది...

టెలిగ్రామ్ యాప్ పలు కొత్త ఫీచర్లను అభివృద్ధిపర్చింది. మెసేజ్‌లను వెదికిపట్టుకునేందుకు కొత్త సెర్చ్ ఫిల్టర్‌ను మెరుగుపర్చింది. చాట్స్, మీడియా, లింక్ ఫైల్స్, మ్యూజిక్, వాయిస్ మెసేజ్ తదితర ఆరు రకాలుగా ఇప్పుడు సెర్చ్ చేసే అవకాశం ఈ ఫీచర్‌తో లభిస్తుంది. టైమ్, పీరియడ్, పర్సన్, గ్రూప్ టైప్ చేయడం ద్వారా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రాము + డిసెంబర్ 31 అని టైప్ చేస్తే సంబంధిత మెసేజ్‌ల్లో ఈ రెండింటికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షం అవుతాయి. వాయిస్ మెసేజ్‌లు, స్టిక్కర్లు, జిఐఎఫ్లతో చానల్ మెసేజ్‌కు స్పందించవచ్చు. గ్రూప్ అడ్మిన్ ఫీచర్‌కు కూడా కొన్ని ఫీచర్లను కల్పించారు.
ఆండ్రాయడ్ ఫోన్లో టెలిగ్రామ్‌ను ఉపయోగించేవారికి మరికొన్ని ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. మెసేజ్‌ల డిలీట్, మీడియా సేవింగ్, నోటిఫికేషన్ మార్పు సమయంలో సరికొత్త యానిమేషన్ ఫీచర్ కనిపిస్తుంది. లెఫ్ట్ మెనూలో పగలు, రాత్రి థీమ్‌లతో కీబోర్డ్ లేదా స్విచ్‌ను విస్తృతపర్చుకోవడం లేదా దాచి ఉంచే సదుపాయాలనూ అమర్చింది.