కరోనావైరస్.. లాక్‌డౌన్: టాటా మోటార్స్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-29T03:13:45+05:30 IST

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ లాక్‌డౌన్ కాలంలో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనావైరస్.. లాక్‌డౌన్: టాటా మోటార్స్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ లాక్‌డౌన్ కాలంలో కీలక నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కార్ల సర్వీస్ వారెంటీ, ఉచిత సర్వీస్ గడువు కాలాన్ని పొడిగించినట్లు టాటా మోటార్స్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వారెంటీ గడువును మార్చి 15 నుంచి మే 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. వారెంటీ సర్వీస్‌ను జులై 31 వరకు పొడిగించినట్లు సంస్థ పేర్కొంది.

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ కేసులను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్ కాలంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. కోవిడ్-19పై పోరాటం చేసేందుకు మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు, 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించారు.

Updated Date - 2020-03-29T03:13:45+05:30 IST