స్వదేశీ యాప్‌ స్టోర్‌!

ABN , First Publish Date - 2020-10-03T05:30:00+05:30 IST

ఆపిల్‌, ఆల్ఫాబెట్‌కు ప్రత్యామ్నాయంగా దేశీ యాప్‌ స్టోర్‌ను ఆరంభించే ఆలోచనలో భారత్‌ ఉంది...

స్వదేశీ యాప్‌ స్టోర్‌!

ఆపిల్‌, ఆల్ఫాబెట్‌కు ప్రత్యామ్నాయంగా దేశీ యాప్‌ స్టోర్‌ను ఆరంభించే ఆలోచనలో భారత్‌ ఉంది. దేశీయంగా స్వయంసమృద్ధిని సాధించే కృషిలో భాగంగా చేస్తున్న యత్నమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో ఆండ్రాయిడ్‌ మార్కెట్‌ షేర్‌ 97 శాతం. దరిమిలా ఇందులో జోక్యం చేసుకోవడమే కాకుండా దేశీ స్టార్టప్‌లు పట్టు బిగించేలా చూడాలని భావిస్తోంది. గూగుల్‌, ఆపిల్‌ మాదిరిగా 30 శాతం చార్జీలను వసూలు చేయరాదని అనుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌స్టోర్‌ను ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసేలా చూడాలనే ప్లాన్‌ కూడా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-10-03T05:30:00+05:30 IST