సగానికి తగ్గిన స్టోరేజ్‌ ఛార్జీలు

ABN , First Publish Date - 2020-12-19T06:34:25+05:30 IST

పరిమితికి మించి ఫొటోల స్టోరేజీకి ఫీజు చెల్లించాలన్న గూగుల్‌, ప్రస్తుతం ఆ ఛార్జీలను సగానికి తగ్గించింది. స్టోరేజ్‌కు పరిమితి విఽధించి ఆపై కావాలనుకునే స్పేస్‌ను బట్టి రేట్లు ప్రకటించింది. అయితే రేట్లకు సంబంధించి హయ్యర్‌ టైర్లకు డిమాండ్‌ పెరిగింది.

సగానికి తగ్గిన స్టోరేజ్‌ ఛార్జీలు

రిమితికి మించి ఫొటోల స్టోరేజీకి ఫీజు చెల్లించాలన్న గూగుల్‌, ప్రస్తుతం  ఆ ఛార్జీలను సగానికి తగ్గించింది. స్టోరేజ్‌కు పరిమితి విఽధించి ఆపై కావాలనుకునే స్పేస్‌ను బట్టి రేట్లు ప్రకటించింది. అయితే రేట్లకు సంబంధించి హయ్యర్‌ టైర్లకు డిమాండ్‌ పెరిగింది. అయినప్పటికీ గూగుల్‌ పది టిబికి మించికి స్పేస్‌ కోసం నిర్ణయించిన ఛార్జీలను రమారమి సగానికతగ్గించింది. కొత్త ప్రతిపాదన ప్రకారం 10 టిబి టైర్‌ రేటును 99.99 డాలర్ల నుంచి 49.99 డాలర్లకు తగ్గించింది. అదే వరుసలో 20 టిబికి 199.99 డాలర్ల నుంచి 99.99 డాలర్లకు, 30టిబి కోసం 299.99 డాలర్ల నుంచి 149.99 డాలర్లకు తగ్గించింది.


అయితే ఈ తగ్గింపు అంతకు దిగువ స్థాయిలో స్పేస్‌ కోరుకున్న వారికి మాత్రం లేదు. అత్యున్నత స్థాయిలో స్పేస్‌ కోరుకున్న వినియోగదారులే ఎక్కువగా ఉండటంతో రేటులోనూ తగ్గింపునకు కారణమని కంపెనీ వర్గాలు విశదీకరించాయి. మూర్స్‌ లా అంటే ఉన్న డిమాండ్‌కు తగ్గవిధంగా ఎక్కువ మందికి అందుబాటు తద్వారా కన్స్యూమర్‌ బేస్‌ను గూగుల్‌ పెంచుకుంటోంది. 

Updated Date - 2020-12-19T06:34:25+05:30 IST