వీడియో కాన్ఫరెన్స్ కోసం ‘సే నమస్తే’
ABN , First Publish Date - 2020-08-01T07:49:57+05:30 IST
జూమ్ యాప్ ఎందుకు? స్వదేశీ యాప్స్ లేవా? అనే వారు ‘సే నమస్తే’ యాప్‌ను ఎంచుకోవచ్చు.

జూమ్ యాప్ ఎందుకు? స్వదేశీ యాప్స్ లేవా? అనే వారు ‘సే నమస్తే’ యాప్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో 50 మంది వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. డాక్యుమెంట్లు, పీడీఎఫ్ ఫైళ్లు, ప్రెజెంటేషన్లు, ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. కార్పోరేట్ సంస్థలు తమ మీటింగ్లకే కాకుండా, కుటుంబసభ్యులు వీడియోలో మాట్లాడుకోవడానికి ఈ యాప్ బాగా ఉపకరిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యాప్ ఓపెన్ చేశాక క్రియేట్ న్యూ మీటింగ్ ఆప్షన్ ఎంచుకొని పేరు ఎంటర్ చేసి, స్టార్ట్ మీటింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. యాప్ ఎడమ వైపు పైభాగంలో షేర్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి కాంటాక్ట్స్‌ను సెలక్ట్ చేసి మీటింగ్ ఐడీ, కోడ్‌ను షేర్ చేయడం ద్వారా వీడియె కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు.