శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్స్.. ప్రీ-రిజిస్ట్రేషన్..

ABN , First Publish Date - 2020-02-12T23:09:33+05:30 IST

క్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది.

శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్స్.. ప్రీ-రిజిస్ట్రేషన్..

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. మార్చి 6 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్20 స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. 5జీ మోడల్స్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ రూ. 98,400 ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫోన్ ప్రారంభ ధర రూ. 71,300కే అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

Updated Date - 2020-02-12T23:09:33+05:30 IST