శాంసంగ్ గెలాక్సీ ఎస్20 స్మార్ట్‌ఫోన్లపై లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్

ABN , First Publish Date - 2020-03-21T23:21:39+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 స్మార్ట్‌ఫోన్లపై లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై లిమిటెడ్ పీరియడ్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 6 వేల వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసే వారికి కూడా వర్తించనుంది. భారత మార్కెట్‌లో మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 రూ. 65,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్20ప్లస్ రూ.73,999 ఉంటుంది.

Updated Date - 2020-03-21T23:21:39+05:30 IST